Breaking News

తిరువూరులో మళ్లీ మాటల యుద్ధం

Published on Sat, 12/13/2025 - 07:12

తిరువూరు: ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్బుకా, పార్టీకా?’.. అంటూ ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో తన పార్టీ నేతలపై మరోమారు మాటల దాడికి దిగారు. పార్టీ మండల స్థాయి నేతను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

గత కొద్దికాలంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలతో నియోజకవర్గంలో పార్టీ ఇరువర్గాలుగా చీలిపోయింది. దీంతో పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తంటాలు పడుతున్న సమయంలో కొలికపూడి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. 

విస్సన్నపేట మండలానికి చెందిన ముఖ్యనేతను ఉద్దేశించి కొలికపూడి.. ‘పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్‌’ అంటూ సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే పోస్టు చేయడంతో ప్ర­త్య­ర్థి వర్గం దీనికి కౌంటర్‌గా శుక్రవారం మీడియా సమావేశం ఏర్పా­టుచేసింది. ఎమ్మెల్యే తననుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని, తాను సాయిబాబా సాక్షిగా ప్రమాణం చేసి తాను పేకాట శిబిరాలు నిర్వహించట్లేదని చెబుతానని, ఎమ్మెల్యే కూడా తనపై చేసిన ఆరోపణల నిరూపణకు ప్రమాణం చేస్తారా అని విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావు ప్రశ్నించారు. 

తిరు­వూరు­లో బెల్టుషాపులను అడ్డుకుంటానని చెప్పి మద్యం సిండికేట్ల వద్ద డబ్బు దండుకోవడం, ఎ.కొండూరు మండలం గోపాలపురంలో మట్టి తవ్వ­కాలకు యత్నించి గ్రామస్తులు ప్రతిఘటించడంతో తోక ము­డవడం ఎమ్మెల్యేకే చెల్లిందని ప్రత్యారోపణ చేశారు. ఇక కొలికపూడి తమ ఎమ్మెల్యే అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నామన్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)