Breaking News

హైకోర్టు చెప్పినా ససేమిరా!

Published on Tue, 04/08/2025 - 06:04

వెల్దుర్తి :  హైకోర్టు తీర్పు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్నే అమలుచేస్తున్నారు. తాము చెప్పిందే తీర్పు.. చేసేదే పాలన.. హైకోర్టు, పోలీసులతో ఏమాత్రం పనిలేదన్నట్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెలో గత ఏడాది ఎన్నికల తర్వాత జరిగిన ఓ హత్యోదంతం అనంతరం 37 మందిని ఊరు నుంచి టీడీపీ నేతలు తరిమేశారు. వీరిని తిరిగి ఊళ్లోకి పంపాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది.

టీడీపీ నేతలు మాత్రం ససేమిరా అన్నారు. అ­యినా, భారీ పోలీసు బందోబస్తు మధ్య బాధితులు సోమవారం ఊళ్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే రాళ్ల దాడికి తెగబడ్డారు. పోలీసులు అడ్డుపడినా ఖాతరుచేయలేదు. చివరికి.. వీరిలో కొంతమంది ఇళ్లకు చేరుకుంటే, ఇంకొందరు వారి గడప తొక్కకుండానే వెనుదిరిగారు. కర్నూలు జిల్లాలో సోమవారం ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన వివరాలు.. 

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. 
పత్తికొండ నియోజకవర్గం బొమ్మిరెడ్డిపల్లెలో గత ఏడాది ఎన్నికల కౌంటింగ్‌ ముగిశాక గ్రామంలో గిరినాథ్‌ చౌదరి అనే వ్యక్తి ఓ ఇంట్లోకి వెళ్లి మహిళపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భర్త కర్రతో దాడిచేశారు. దీంతో గిరినాథ్‌ చనిపోయాడు. ఈ ఘటన అప్పట్లో గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. హత్య తర్వాత నిందితులతో పాటు వైఎస్సార్‌సీపీ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఇతర నేతలు 11మందిని అక్రమంగా కేసులో ఇరికించారు. మొత్తం 37 మందిని ఊరు నుంచి తరిమేశారు. శాంతిభద్రతల పేరుతో పోలీసులు కూడా అప్పట్లో వీరిని గ్రామంలోకి అనుమతించలేదు.

దీంతో పదినెలలుగా వీరంతా పిల్లలను వేరేచోట  చదివించుకుంటూ, పొలాలను బీడుగా వదిలి గ్రామంలోకి రాకుండా అజ్ఞాతంలో ఉంటున్నారు. ఈ క్రమంలో వీరిలో 32 మంది హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల పక్షాన సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘పోలీసులు, వైరివర్గాలు 10 నెలలుగా బాధితులను గ్రామంలోకి రానివ్వలేదని, వారంతా బంధువుల ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని’ వాదించారు.

 పొన్నవోలు వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్‌ హరినాథ్‌.. పిటిషనర్లు గ్రామంలోకి వెళ్లేలా మార్చి 26న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు కాపీలతో బాధితులు వెల్దుర్తి పోలీసుస్టేషన్‌ చుట్టూ పలుమార్లు తిరిగినా శాంతిభద్రతల పేరుతో పోలీసులు వారిని గ్రామంలోకి 
పంపకుండా జాప్యంచేశారు. బాధితులు తిరిగి హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు సోమవారం వారిని బందోబస్తు మధ్య గ్రామంలోకి పంపేందుకు ప్రయత్నించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)