Breaking News

హిందూపురంలో టీడీపీ రాజకీయ కక్షసాధింపు

Published on Mon, 11/24/2025 - 14:35

సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురంలో ఎక్సైజ్ శాఖ చర్యలపై తీవ్ర రాజకీయ వివాదం చెలరేగింది. స్థానిక మద్యం వ్యాపారి ప్రశాంత్ గౌడ్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. అక్రమ కేసు పెడుతున్నామంటూ బహిరంగంగా ప్రకటించి మరీ ఆయన్ని అదుపులోకి తీసుకోవడాన్ని రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి.

ప్రశాంత్ గౌడ్‌ను కొన్ని రోజులుగా స్థానిక టీడీపీ నేతలు బెదిరిస్తూ, మద్యం షాపును తమకు అప్పగించాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఈ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఆయన అరెస్ట్‌ కావడం గమనార్హం. అంతేకాదు.. కేసు నమోదు సమయంలో “నీపై అక్రమ కేసు పెడుతున్నాం.. నన్ను క్షమించు” అని ఎక్సైజ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య అన్నారని ప్రశాంత్ గౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు.

టీడీపీ నాయకుల ఒత్తిడితోనే పోలీసులు ఈ కేసు పెట్టారని వైఎస్సార్‌ సీపీ వర్గాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. హిందూపురం శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, స్థానిక టీడీపీ నేతల బరితెగింపు పెరిగిందని వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ తీరును హిందూపురం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త దీపిక,  వైఎస్సార్‌ సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్  తప్పుబట్టారు. టీడీపీ నేతల సూచన మేరకు అక్రమ కేసులు నమోదు చేయడం విచారకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ గౌడ్‌పై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)