Breaking News

వక్ఫ్‌ భూమికి ఎసరు!

Published on Tue, 09/16/2025 - 06:20

సాక్షి ప్రతినిధి కర్నూలు: అధికారం ఉండగానే వీలైనంతగా దండుకోవాలన్నట్లుగా ఉంది టీడీపీ నేతల తీరు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీగా కనిపిస్తే అక్కడ రాబందుల్లా వాలిపోతున్నారు. కర్నూలు జిల్లాలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసేందుకు పచ్చబ్యాచ్‌ పావులు కదుపుతుంటే, నంద్యాల జిల్లా బనగానపల్లిలో అయితే ఏకంగా వక్ఫ్‌బోర్డు స్థలానికే ఎసరు పెట్టేశారు. మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కనుసన్నల్లోనే ఈ బాగోతం నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.10 కోట్లకు పైగా విలువైన స్థలం కబ్జా చేయడం ఇప్పుడు పట్టణంలో తీవ్ర చర్చకు దారితీసింది. 

బనగానపల్లె పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఎస్‌ఆర్‌బీసీ (శ్రీశైలం కుడికాల్వ) పక్కన సర్వే నెంబర్‌ 132లో 12.66 ఎకరాలు ఉంది. సర్వే నంబర్‌ 132/2బీలో 5.11 ఎకరాలు, 132/3లో 4.30 ఎకరాలు, 132/2లో 3.24 ఎకరాలు ఉంది. ఇందులో కొంత ఎస్‌ఆర్‌బీసీకి వినియోగించారు. అయితే, సర్వే నంబర్‌ 132/3లోని 4.30 ఎకరాలు ఖాళీగా ఉంది. ఇందులో కంపచెట్లు ఉన్నాయి. ఈ స్థలంపై టీడీపీ నేతల కన్నుపడింది. మూడ్రోజులుగా అక్కడ కంపచెట్లను జేసీబీలతో తొలగించి స్థలాన్ని చదును చేస్తున్నారు. గ్రావెల్‌ తోలి దాన్ని కబ్జా చేస్తున్నారు. ఇలా కంపచెట్లు తొలగించి, చదును చేసి ఆక్రమించిన స్థలం 75 సెంట్లు ఉంటుందని సమాచారం.

అధికారంతో అప్పనంగా కొట్టేయాలని.. 
మంత్రి అనుచరులు కబ్జా చేస్తున్న ఈ స్థలం సర్వే నంబర్‌ను రిజి్రస్టేషన్‌ శాఖలో విచారిస్తే అది వక్ఫ్‌ బోర్డు స్థలంగా తేలింది. రిజిస్ట్రేషన్‌ శాఖలో పైన పేర్కొన్న మూడు సర్వే నంబర్లలోని 12.66 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంది. ఈ క్రమంలో వక్ఫ్‌ బోర్డు స్థలాన్ని ఎలాంటి లీజుకు తీసుకోకుండా కబ్జాచేయడం చూస్తే అధికారాన్ని అడ్డు­పెట్టుకుని అప్పనంగా కొట్టేయాలన్న కుట్ర కన్పిస్తోంది.

 స్థలం విలువ రూ.10 కోట్లుపైనే
ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఈ ప్రాంతంలో సెంటు స్థలం విలువ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు ఉంది. రూ.15 లక్షలు చొప్పున లెక్కించినా కబ్జా చేస్తున్న 75 సెంట్ల స్థలం విలువ రూ. 11.25 కోట్లు ఉంది. ఈ కబ్జా 75 సెంట్లతోనే ఆగుతారా? లేదా విడతల వారీగా మొత్తం 4.30 ఎకరాలు స్వాహాచేస్తారా అనే అను­మానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ మొత్తం 4.30 ఎకరాలు హస్తగతం చేసుకుంటే రూ.64 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కాజేసినట్లే. ఈ స్థలాన్ని మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అనుచరులు చదునుచేసి అభివృద్ధి చేస్తున్నారు. అయితే, అనుచరులు కాదు.. మంత్రే కబ్జా చేస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నిజానికి.. వక్ఫ్‌ బోర్డు భూములు, స్థలాలను ముస్లిం మైనార్టీల అవసరాలకు మాత్రమే వినియోగించాలి, కానీ, అసలు వక్ఫ్‌ బోర్డుకు సంబంధంలేకుండా, వారి అనుమతిలేకుండా కబ్జా చేయడం చూస్తే బీసీ గ్యాంగ్‌ ఏ స్థాయిలో అరాచకం చేస్తోందనేది స్పష్టమవుతోంది.

మా దృష్టికి వచ్చింది, ఫిర్యాదు చేశాం 
బనగానపల్లిలో వక్ఫ్‌ బోర్డు స్థలంలో ముళ్లపొదలు తొలగించి కబ్జా చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచి్చంది. మొత్తం 4.30 ఎకరాల వక్ఫ్‌ స్థలం ఉంది. ఈ కబ్జాపై బనగానపల్లి తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశాం. దీనిపై చర్యలు తీసుకుంటాం.  – ఇమ్రాన్, వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)