Breaking News

పింఛన్లు అడ్డుకుని దొంగ ఏడుపు

Published on Tue, 04/02/2024 - 04:47

సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా పక్కాగా, ఠంచ­న్‌గా జరుగుతున్న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీని అడ్డుకునే వరకు నిద్రపోని టీడీపీ నాయ­కులు ఇప్పు­డు మొసలి కన్నీళ్లు కారుస్తుండటంపై లబ్ధి­దారులు తీవ్రంగా మండిపడుతు­న్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వలంటీర్లు ప్రతి నెలా 1న ఇంటివద్దే పెన్షన్లు అందిస్తుం­డటాన్ని సహించలేని చంద్ర­బాబు దొడ్డిదా­రిన అడ్డుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ నేతృత్వంలోని సిటిజన్‌ ఫర్‌ డెమో­క్రసీ సంస్థ ద్వారా వలంటీర్లపై వరుసగా ఫిర్యా­దులు చేశారు. దీంతో కోడ్‌ ముగి­సేవరకు వలంటీర్లను ఈ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ ఆదే­శి­ంచడం­తో ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి అవాంతరా­లు ఎదుర­య్యాయి. కానీ, ప్రజా­గ్రహంతో ఉలిక్కి­పడ్డ టీడీపీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారా­యణ, దేవినేని ఉమా తదితరులు ఇంటివద్దే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.

ఐదో తేదీ లోపు పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలని వినతిపత్రం సమర్పించారు. వలంటీర్లు అర్థరాత్రి ఇళ్లకు వెళ్లి తలుపులు తడుతున్నారంటూ గతంలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకపోవడం వెనుక వైఎస్సార్‌సీపీ కుట్ర దాగి ఉందంటూ ఎదురుదాడికి దిగారు. వలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేపట్టవద్దంటూ తాము ఎవరినీ కోరలేదంటూ తనకు అలవాటైన రీతిలో బుకాయించారు. టీడీపీ బూత్‌ కన్వీనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలే విస్తుపోయారు. పింఛన్లు అందకపోవటానికి సీఎం జగనే కారణమని ప్రచారం చేయాలని చంద్రబాబు వారికి సూచించారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)