Breaking News

పశ్చిమలో వెంకన్న సైలెంట్‌.. అనుచరుల ఆగ్రహం

Published on Sat, 05/11/2024 - 10:51

వన్‌టౌన్‌(విజయవాడపశ్చమ): ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో పశ్చమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న హవా నడిచింది. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం బుద్దా వెంకన్న ఇంటికే పరిమితమయ్యారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సుజనాచౌదరితో పాటు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కూడా బుద్దా వెంకన్నను పూర్తిగా దూరం పెట్టారు. దాంతో నియోజకవర్గంలో బుద్దా వెంకన్న వర్గం సైలెంట్‌ అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి బీజేపీ అభ్యర్థిగా సుజనాచౌదరిని పోటీకి దింపారు. సుజనాచౌదరి వచ్చిన తొలి నాళ్లలో బుద్దా వెంకన్న తన క్యాడర్‌తో కాస్త హడావుడి చేశారు. కానీ గడిచిన 15 రోజులుగా ఆయన ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. 

ఆర్థిక అంశాలను తనకు అప్పజెబుతారనుకున్న బుద్దా 
లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని చిన్ని, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న  బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి ఇద్దరూ ఎన్నికలకు సంబంధించిన ఆర్థిక అంశాలను తనకు అప్పగిస్తారని బుద్దా వెంకన్న ఆశించారు. నియోజకవర్గంలో కేశినేని చిన్నితో గడిచిన ఏడాదిన్నర కాలంగా అనేక కార్యక్రమాలను సైతం బుద్దా వెంకన్న నిర్వహించారు. కానీ ఎన్నికల సమయంలో మాత్రం చిన్ని బుద్దా వెంకన్నను నమ్మకపోవటంతో ఆయనను దూరంగా ఉంచారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సుజనాచౌదరి ఆర్థిక కార్యకలాపాలన్నీ తన ద్వారానే నిర్వహిస్తారని బుద్దా వెంకన్న భావించారు. కానీ సుజనాచౌదరి సైతం బుద్దా వెంకన్నను నమ్మకుండా దూరంగా ఉంచారు. ఇద్దరూ వేరువేరుగా నియోజకవర్గంలో తమ తాలుకా వ్యక్తులను రంగంలోకి దింపి ఆర్థిక అంశాలను చక్కబెట్టే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.  

ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యుడైనప్పటికీ... 
పశ్చమ నియోజకవర్గంలో  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక కమిటీని వేసి దాని ద్వారా ఖర్చులు చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం సూచన చేసింది. అందులో బుద్దా వెంకన్నను సైతం సభ్యునిగా సూచించారు. కానీ సుజనాచౌదరి ఆ కమిటీ ఏర్పాటుకు, దాని ద్వారా నిర్వహణకు వ్యతిరేకించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుద్దా వెంకన్నను నమ్మకపోవటం వలనే సుజనాచౌదరి వ్యతిరేకించినట్లు సమాచారం. దాంతో అటు కేశినేని చిన్ని, ఇటు సుజనాచౌదరి రెండు శిబిరాలు వెంకన్నను దూరంగా పెట్టాయి. అందువలన ఇద్దరికీ బుద్దా వెంకన్న దూరంగా ఉంటూ ఇంటికి మాత్రమే పరిమితమయ్యారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తమ నాయకుడిని పట్టించుకోకపోవటంతో బుద్దా వెంకన్న క్యాడర్‌ సైతం ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేయటం లేదని తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు ఒకరు చెబుతున్నారు.    

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి