Breaking News

కోడి పందేల్లో కూటమి నేతల బరితెగింపు

Published on Mon, 01/13/2025 - 11:19

సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులే పందెంలను ప్రారంభిస్తున్నారు. ఇక, పందెం రాయుళ్లు.. కోడి పుంజులతో బరులకు చేరుకుంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్‌ నైట్‌ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పందెం బరుల దగ్గర ఎల్‌ఈడీ తెరలు సైతం దర్శనమిస్తున్నాయి. పెందెంలా నిర్వహణ కోసం భారీ ఏర్పాటు. మరోవైపు.. స్థానికంగా జరుగున్న కోడి పందెంలను చూసేందుకు ప్రజలు భారీగా బరుల వద్దకు చేరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. కోడి పందేలు నిర్వహించడం నేరమని కలెక్టర్లు ప్రకటిస్తున్నా.. పందేలను కట్టడి చేయాలని హైకోర్టు గట్టిగా ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు హైకోర్టు ఆదేశాలు పాటించాల్సిందేనని న్యాయస్థానం సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చినా ఎక్కడికక్కడ జరగాల్సిన పనులు జరిగిపోతున్నాయి. పందేలరాయుళ్లు ఇన్‌స్టా వేదికగా కోడి పందేలపై విస్తృత ప్రచారానికి తెరతీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నిట్‌ కళాశాల సమీపంలోని వెంకట్రామయ్య బరిలో భారీ పందేలు నిర్వహిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. భోగి రోజున రూ.9 లక్షల పందేలు 9, రూ.6 లక్షల పందేలు 5,  రూ.27 లక్షలు లేదా రూ.25 లక్షల పందెం ఒకటి చొప్పున జరుగుతాయని షెడ్యూల్‌ ప్రకటించుకున్నారు.

నిషేధం బేఖాతరు.. 
కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఈ నెల 7న సమావేశం నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974­లోని సెక్షన్‌ 9(1), 2 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పశు సంవర్ధకశాఖ, పోలీసులు, రెవెన్యూ శాఖతో బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులు కోడిపందేల నిషేధంపై ఫ్లెక్సీలు, పోస్టర్లు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా పందేలు జరిగే ప్రాంతాలు, షెడ్యూల్స్, పందేలు వేసే ప్రముఖుల పేర్లతో పోస్టులు ట్రెండింగ్‌ అవుతున్నాయి.

దెందులూరు నియోజకవర్గంలో ‘ప్రీమియర్‌ లీగ్‌’ 
వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి మండలం దుగ్గిరాలలో కాకతీయ ప్రీమియర్‌ లీగ్‌ (కోడి పందేల లీగ్‌) పేరుతో పందేలకు రెడీ అంటూ పోస్టులు వైరల్‌ అవుతున్నాయి. క్రికెట్‌ టోర్నమెంట్స్‌ లీగ్‌ మాదిరిగా కోడి పందేల లీగ్‌ అనే పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మరీ ప్రచారం సాగిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)