Breaking News

గంటాను గెలిపించి తప్పు చేశాం..

Published on Sat, 07/05/2025 - 13:42

విశాఖపట్నం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న జీవీఎంసీ భీమిలి జోన్‌ 2, 3 వార్డు నాయకులు, భీమిలి మండల నాయకులు శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీకి ఫిర్యాదు చేశారు. గంటాను గెలిపించుకోవడం తమకు భస్మాసురహస్తం అయిందని వారు బాబ్జీ వద్ద వాపోయినట్లు తెలిసింది. 

ఈ నెల 7న తాళ్లవలసలో జరగనున్న ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమం గురించి అదే గ్రామానికి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు డీఏఎన్‌ రాజుకు ఇప్పటివరకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గంటా వెంట ఉన్న వ్యక్తి (స్వామి) ఇప్పుడు కూటమి నాయకుల నెత్తిన కూర్చుని సెటిల్‌మెంట్లు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గంటా శైలి మారకపోతే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం ఢిల్లీ నుంచి రానున్న ఎంపీ భరత్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం.. అమరావతి వెళ్లి పార్టీ అధిష్టానం దృష్టికి తమ సమస్యను వివరిస్తామని నాయకులు తెలిపారు. బాబ్జీకి ఫిర్యాదు చేసిన వారిలో డీఏఎన్‌ రాజు, యరబాల అనిల్‌ ప్రసాద్, పతివాడ రాంబాబు, సాగిరాజు రాంబాబు, గరికిన పరశురాం, మరగడ రఘురామిరెడ్డి, లక్ష్మణరావు, వివిధ పంచాయతీల నాయకులు ఉన్నారు. అంతకు ముందు వారంతా డీఏఎన్‌ రాజు ఇంటి వద్ద సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)