Breaking News

చెట్లను కాదు.. మమ్మల్ని నరికేయండి!

Published on Wed, 04/16/2025 - 02:40

గంగాధర నెల్లూరు: ‘చెట్లను నరకడం కంటే..  మమ్మల్ని నరికేయండి’ అంటూ టీడీపీ నాయకులపై వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆక్రో­శం వ్యక్తం చేశాడు. మూడేళ్లుగా కంటికి రెప్ప­లా.. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న మామిడి, టే­కు చెట్లను అన్యాయంగా నరికివేశారంటూ కన్నీ­రుమున్నీరయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదంటూ వాపోయాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం కుప్పనపల్లికి చెందిన రైతు, వైఎస్సార్‌సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి వరత్తూరులో సర్వే నం.840లో మూడు ఎకరాల 30 సెంట్ల భూమి ఉంది.

మూడేళ్ల క్రితం ఆ భూమిలో రూ.లక్షలు వెచ్చించి మామిడి, టేకు చెట్లను నాటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ­డంతో.. స్థానిక టీడీపీ నాయకులు యువరా­జురెడ్డి, గంగిరెడ్డి ఆ భూమిపై కన్నేశారు. దౌర్జన్యంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో 115 మామిడి, 50 టేకు చెట్లను నరికేశారు. ఈ దారుణంపై శంకర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కానిస్టేబుళ్లను పంపించి ప్రాథమిక విచారణ చేశారు. 

కానీ రెండు రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో  రైతుఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నియో­జక­వర్గ ఇన్‌చార్జ్‌ కృపాలక్ష్మి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దృష్టికి తీసుకెళ్లారు. నారా­యణస్వామి మంగళవారం కుప్పనపల్లికి చేరుకుని శంకర్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారం అండతో ఎంతటికైనా దిగజారుతారా? అని మండిపడ్డారు. ఈ సమస్యపై జిల్లా ఎస్పీకి పలుమార్లు ఫోన్‌ చేసినా.. కనీస స్పందన లేదని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)