Breaking News

జగనన్న పేరంటేనే ఝడుపా!

Published on Mon, 12/08/2025 - 13:36

సామర్లకోట: ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీకి ఇంకా ఎన్నికల కోడ్‌ ముగిసినట్టు లేదు. కోడ్‌ నిబంధనల మేరకు వేసిన రంగులు నేటికీ తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాలనీ పేరును పునరుద్ధరించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం లే అవుట్‌లో సుమారు 50 ఎకరాల్లో అప్పటి హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు అధ్యక్షతన జగనన్న కాలనీ పేరిట అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 2023 అక్టోబరు 12న ప్రారంభించారు. 

ప్రత్తిపాడు రహదారికి ఇరువైపులా ఉన్న ఈ కాలనీకి రెండు వైపులా రెండు ముఖద్వారాలు ఏర్పాటు చేసి కౌన్సిల్‌ తీర్మానంతో జగనన్న కాలనీగా పేరు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముఖద్వారాలపై ఉన్న జగనన్న పేరుపై నలుపు రంగు వేశారు. నాడు వేసిన రంగులు నేటికీ తొలగించపోవడం విమర్శలకు తావిస్తోంది. జగనన్న పేరు పునరుద్ధరణపై నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు మున్సిపల్‌ కమిషనర్‌కు వివరించినా ప్రయోజనం కనిపించలేదు. కాగా ఈ కాలనీకి టీడీపీ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి యతి్నస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉంది. 

పేదలకు ఎంతో విలువైన స్థలాలు 
ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం రహదారుల కూడలిలో రోడ్డు మార్జిన్‌లో ఈ కాలనీలో ఇప్పటికే అనేక మంది ఇళ్లు నిర్మించుకోవడమే కాకుండా పార్కులతో కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీకి ఆదరణ పెరుగుతుందనే కక్షతో ముఖద్వారాలపై పేర్లు రాయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడంతో ఆయన పేరు చరిత్రలో గుర్తుండిపోతుంది. అటువంటి ముఖ్యమంత్రి పేరును రాయించడానికి మున్సిపల్‌ అధికారులకు ఎందుకు చేతులు రావడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  
ఏపీ బీసీఎల్‌ వైపు ఉన్న కాలనీ ముఖద్వారంపై పేరు కనపడకుండా పూర్తిగా వేసిన రంగు   

కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లాం 
ఈటీసీ లే అవుట్‌లోని వైఎస్సార్‌ జగనన్న కాలనీ ముఖద్వారంపై ఉన్న పేరుకు రంగులు తొలగించాల్సిన విషయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లాం. అనేక కౌన్సిల్‌ సమావేశాలలో అధికారులను ప్రశ్నించాం. గతంలో తాను పని చేసిన ప్రదేశాల్లోని భవనాలకు రంగులు వేయలేదని, కేవలం పేపర్లు అతికించామని కమిషనర్‌ చెప్పారు. గతంలో ఉండేలా పేర్లు రాయిస్తానని హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన స్వయంగా పరిశీలించి కమిషనర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు.      
– ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోట

జగనన్న కాలనీపై కుట్ర జరుగుతోంది 
జగనన్న కాలనీపై ఏదో కుట్ర జరుగుతోంది. ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా చేయడం లేదు. ఎన్నికల కోడ్‌ సమయంలో జగనన్న కాలనీ ముఖద్వారానికి వేసిన రంగుల స్థానంలో పేర్లు రాయించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.శ్రీవిద్య దృష్టికి తీసుకు వెళ్లాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్ధం కాలేదు. మా నాయకుడు దొరబాబుతో చర్చించి ఏంచేయాలో ఆలోచిస్తాం. 
– ఉబా జాన్‌మోజెస్, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్, సామర్లకోట  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)