Breaking News

హిందూపురంలో టీడీపీ నేత హల్‌చల్‌

Published on Fri, 11/07/2025 - 08:54

సాక్షి, శ్రీ సత్యసాయి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పచ్చ పార్టీ నేత ఒకరు రెచ్చిపోయారు. విద్యుత్‌ శాఖ ఉద్యోగిని బూతులు తిడుతూ.. అతడిని చెట్టుకు కట్టేసి కొడతా అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలని బాధితుడు విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ నేత బెదిరింపుల ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వివరాల ప్రకారం.. హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ శాఖ ఉద్యోగి ఎజాజ్‌పై టీడీపీ నేత రంగారెడ్డి రెచ్చిపోయారు. తన పొలంలోనే విద్యుత్ స్తంభాలు వేస్తావా అంటూ ఉద్యోగిపై ఆవేశంతో ఊగిపోయారు. ఎజాజ్‌ను బూతులు తిడుతూ తనను చెట్టుకు కట్టేసి కొడతా అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ క్రమంలో టీడీపీ నేత రంగారెడ్డికి విద్యుత్ శాఖ ఏఈ జయవర్ధన్ రెడ్డి కూడా వత్తాసు పలికారు.

దీంతో.. టీడీపీ నేత రంగారెడ్డి, ఏఈ జయవర్ధన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని లైన్‌మెన్ ఎజాజ్ సెల్ఫీ విడియో విడుదల చేశారు. తనను ఆదుకోవాలని, ఈ ఘటనపై స్పందించాలని ఎమ్మెల్యే బాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు. కాగా, టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి చిలమత్తూరు మండలంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఆయన బెదిరింపులకు సంబంధించిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)