Breaking News

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు.. మధిర సహాన తల్లిదండ్రులు

Published on Sun, 10/20/2024 - 19:59

సాక్షి,అమరావతి : అధికార టీడీపీకి చెందిన నేత, రౌడీషీటర్ నవీన్ ఓ గుండె కోతను మిగిల్చాడు. నవీన్‌ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్ తీసేస్తే మధిర సహన చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలి తల్లిదండ్రులు దిక్కుదోచని స్థితిలో గుండెలవిసేలా రోదిస్తున్నారు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో శనివారం సాయంత్రం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్‌ నవీన్..మధిర సహానను కారులో తీసుకెళ్లాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్‌ తీస్తే ప్రాణాలు పోతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనలో నిందితుడు నవీన్‌కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా మధిర సహాన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. మా కుమార్తె మధిర సహానాను దారుణంగా కొట్టారు. ఒంటినిండా గాయాలు ఉన్నాయి. నిందితులు దాడి చేయడంతో మా కుమార్తెకు బ్రెయిన్ డెడ్‌ అయ్యింది. వెంటిలేటర్ తీసేస్తే ఆమె చనిపోతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఈ దారుణానికి కారణమైన రౌడీషీటర్ నవీన్‌ను కఠినంగా శిక్షించాలి. నవీన్‌తో పాటు మరో ఇద్దరు ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి’ రోదిస్తున్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)