Breaking News

మహానాడుపై బాబుకు టీడీపీ మహిళా నేత లేఖ.. ఆవేదనతో టవర్‌ ఎక్కి..

Published on Wed, 05/28/2025 - 13:09

సాక్షి, వైఎస్సార్: మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ మహిళా నాయకురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. అనంతరం, సెల్‌ టవర్‌ ఎక్కారు సదరు నాయకురాలు. దీంతో, భారీగా పోలీసులు.. అక్కడికి చేరుకుని ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.

మహానాడు సందర్బంగా చంద్రబాబుకు టీడీపీ మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి లేఖ రాశారు. లేఖలో తన మీనాక్షి తన ఆవేదనను వ్యక్తం చేశారు. టీడీపీ కోసం 20ఏళ్లుగా పనిచేస్తున్నా అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేగా మాధవీ రెడ్డి గెలిచిన తర్వాత దళితురాలైన తనకు, ఇతర సీనియర్ కార్యకర్తలకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆమె గెలిచిన తర్వాత కనీసం పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. మహానాడుకు తన లాంటి కరుడుగట్టిన టీడీపీ వారికి ఆహ్వానం లేకపోవడం బాధాకరమన్నారు.

టీడీపీకి ఎంతో సేవ చేసిన తమ లాంటి పార్టీ కార్యకర్తలను చంద్రబాబు, లోకేశ్ వరకూ రాకుండా మాధవీ రెడ్డి కోటరీ అడ్డుకుంటోందని ఆరోపణ చేశారు. నిజమైన కార్యకర్తలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో కడపలో పార్టీ మనుగడే కష్టమన్నారు. తన లాంటి కార్యకర్తల గోడు మీకు తెలియాలనే ఆత్మహత్యకు పూనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. కనీసం తన చావుతోనైనా మిగతా కార్యకర్తలకు న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం, కడపలో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉన్న ఓ సెల్‌ టవర్‌ వద్దకు వెళ్లి.. టవర్‌ ఎక్కారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆమెను కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు. మహానాడు జరుగుతున్న వేళ టీడీపీ నేత ఇలాంటి చేయడం చర్చనీయాంశంగా మారింది.

 

కడపలో టీడీపీ మహిళా నాయకురాలు నిరసన

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)