Breaking News

గొల్ల నాకొ.. మిమ్మల్ని చంపితే ఎవరొస్తారు?

Published on Tue, 06/16/2026 - 02:28

ఒంగోలు వన్‌టౌన్‌: ‘‘గొల్ల నాకొ..ల్లారా మిమ్మల్ని చంపితే ఎవరొస్తారురా’’ అని దూషిస్తూ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వారు యాదవులను టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గడ్డపారతో హత్యాయత్నం చేయడంపై సోమవారం బీసీలు మండిపడ్డారు. ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయం వద్ద బీసీలు, యాదవులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ మాట్లాడుతూ మధుబాబు అనే వ్యక్తి గొర్రెలు కాసుకోవడానికి ఈదుమూడి గ్రామం మీదుగా వెళుతుంటే అధికార పార్టీ సామాజికవర్గం వారు దాడి చేశారని పేర్కొన్నారు.

అనిల్‌ అనే యువకుడిపైనా అదే రోజు దాడి చేశారన్నారు. అనంతరం వీరిని గ్రామంలోని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారన్నారు. బాధితులు సీఐ శేషగిరిరావుకు ఫిర్యాదు చేస్తే.. చిన్న కేసు పెట్టిన పోలీసులు, నిందితులు ఫిర్యాదు చేస్తే బాధితులపై ఎదురు కేసు నమోదు చేశారని, సీఐ నిందితులకు అండగా ఉంటున్నారని మండిపడ్డారు.

ఈదుమూడి గ్రా­మా­న్ని సీఎం చంద్రబాబు పీ–4 గ్రామంగా స్వయంగా దత్తత తీసుకున్నారని, ఇదే గ్రామంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వారు యాదవులు, బీసీలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈదుమూడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు.  

అసలేం జరిగిందంటే..  
బాపట్ల జిల్లా కొత్త గొల్లపాలేనికి చెందిన గొర్రెల కాపరులు ఎల్లా­వుల అనిల్, వడ్లమూడి మధు వేసవిలో గొర్రెల మేత కోసం ప్రకా­శం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి తమ మందతోపాటు వెళ్లి ఇక్కడే ఉంటూ గొర్రెలు మేపుకుంటు­న్నారు. ఈ నెల 7న ఆదివారం గొర్రెలు బీడు భూముల్లో తిరుగుతుండగా ఆ గ్రామానికి చెందిన కొందరు టీడీపీ సామాజికవర్గానికి చెందిన నాయకులు ‘‘ఎవడ్రా నా కొ... మా ఊరిలో.. మా పొలాల్లో గొర్రెలు మేపడానికి’’ అంటూ కులం పేరుతో దూషిస్తూ వారిపై దాడి చేశారు.

అదేరోజు సాయంత్రం గొర్రెలను తోలుకుని వెళ్తున్న బాధితులను అధికార పార్టీకి చెందిన ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, సుబ్రమణ్యం, కావూరి నాగార్జున, రంగారావు, వెంకట్రావు, ప్రసాద్‌ టీడీపీ కార్యాలయంలోకి ఈడ్చుకెళ్లి వెళ్లి కర్రలు, గడ్డపార, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ‘‘మేం అధికారంలో ఉన్నాం.. ఈ విషయం ఎక్కడైనా బయటకు చెప్తే చంపేస్తాం గొల్ల నా కొ...’’ అంటూ బెదిరించారు. గాయాలపాలైన బాధితులు ఒంగో­లు రిమ్స్‌ ఆస్పత్రిలో చేరి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)