Breaking News

టీడీపీ నేత అరాచకం బాలికపై లైంగిక దాడికి యత్నం

Published on Thu, 10/23/2025 - 04:30

తుని రూరల్‌ : తాతయ్యా అని పిలిపించుకుంటూనే మనవరాలి వయసున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. దీనిని అడ్డుకున్న యువకుడిపై ‘నేను కౌన్సిలర్‌ను. మేం ఎస్సీలం’ అంటూ బెదిరింపులకు దిగాడు. సోషల్‌ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీడీపీ నేతకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్‌.అన్నవరం శివారులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తుని పట్టణానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.

తండ్రి లేడు. సెలవులకు తల్లి వద్దకు వెళ్లి, వస్తుంటుంది. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) మంగళవారం 11 గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంజక్షన్‌ చేయించాలని ఉపాధ్యాయులకు చెప్పి ఆ బాలికను తుని మండలం హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో కాపలాదారుడు తోటకు వచ్చాడు. బాలిక వస్త్రాలను నారాయణరావు విప్పడాన్ని గమనించి మందలించాడు.

దీంతో.. ఆవేశం కట్టలు తెంచుకున్న నారాయణరావు ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ కాపలాదారుడిని బెదిరించాడు. వాస్తవానికి నారాయణరావుది కొండవారపేట అయినప్పటికీ, తప్పించుకునేందుకు వీరవరపుపేట అని తప్పుగా చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తానని, తన తోటలోకి ఎందుకు వచ్చారంటూ నారాయణరావును, బాలికను ఆ కాపలాదారు నిలదీశాడు.

బహిర్భూమికి వచ్చామని నమ్మబలికే ప్రయత్నం చేసూ్తనే నారాయణరావు బెదిరింపులకు దిగాడు. దీంతో, బాలికకు న్యాయంచేయాల­నే ఉద్దేశంతో ఆమె కుటుంబ సభ్యులకు తెలి­సున్న వ్యక్తుల ద్వారా కాపలాదారు సమాచారం అందించాడు. ఈలోపు బాలికను గురుకుల పాఠశా­లలో దించి, నారాయణరావు కొండవారపే­ట వె­ళ్లి­పోయాడు. అప్పటికే విషయం తెలియడంతో స్థా­ని­కులు నారాయణరావును మంగళవారం రాత్రి ప­టు­్టకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగిం­చా­రు.

నాలుగైదుసార్లు ఇలాగే..
తాతయ్యనంటూ చెప్పి, గతంలో నాలుగైదుసార్లు ఆ బాలికను నారాయణరావు బయటకు తీసుకువెళ్లినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. తాజాగా, ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఐసీడీఎస్, పోలీస్, విద్యాశాఖ అధికారులు బుధవారం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. బాలిక నుంచి వివరాలు సేకరించారు. గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లినందుకు కిడ్నాప్‌ కేసు, లైంగిక దాడికి యత్నించడంపై పోక్సో చట్టం కింద నారాయణరావుపై కఠినమైన కేసులు నమోదుచేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నేతలు, యువకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. బాలికకు న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

విచారణకు మూడు బృందాలు..
బాలికపై లైంగిక దాడికి యత్నించిన నారాయణరావును అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. ఈ కేసులలో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. 15 రోజుల్లో చార్‌్జషీట్‌ దాఖలు చేస్తామన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)