Breaking News

టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం

Published on Sat, 11/29/2025 - 04:47

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నకిలీ మద్యంలో తమ పార్టీ నేతలను ఆదర్శంగా తీసుకున్నాడేమో..? పార్టీలోని పెద్దలే అక్రమ దందాను ప్రోత్సహిస్తుంటే తాను మాత్రం ఎందుకు చేయొద్దు అనుకున్నాడేమో..? టీడీపీ నేత కల్తీ మద్యం దుకాణం తెరిచాడు..! శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ నాయకుడు అయిన పైడి ముఖలింగం అలియాస్‌ నూకరాజు పేరిట సరుబుజ్జిలిలో ఉన్న పీఆర్‌ వైన్స్‌లో శుక్రవారం 10.88 లీటర్ల నీళ్లు కలిపిన మద్యం పట్టుబడింది. 

లీటర్‌ పరిమాణంలోని కల్తీ మద్యం వాటర్‌ బాటిళ్లు 9, నీళ్లు కలిపిన 11 క్వార్టర్‌ బాటిళ్లను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొంతకాలంగా ఈ షాప్‌లో అమ్ముతున్న మద్యంపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కల్తీ సరుకు విక్రయిస్తున్నట్లుగా మందుబాబులు ఫిర్యాదులు చేస్తున్నారు. 

అధిక రేట్లు, చిల్లర విక్రయాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఎవరైనా ప్రశ్నిస్తే... ‘‘మాకు ఎమ్మెల్యే అందండలున్నాయి. ఇది ఆయన షాప్‌’’ అని బెదిరించేవారని చెబుతున్నారు. దీంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకురాలేదు. 

ఓనర్‌ను వదలి వర్కర్లపై కేసు 
దుకాణ యజమాని అయినా కల్తీ మద్యం వ్యవహారంలో ముఖలింగంపై కేసు పెట్టలేదు. పీఆర్‌ వైన్స్‌లో కల్తీ మద్యానికి బాధ్యులుగా అందులో సేల్స్‌మెన్లుగా పనిచేస్తున్న కుసుంపోలవలస గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, దన్నానపేటకు చెందిన సాసుపల్లి శ్రీనివాసరావులను అరెస్ట్‌ చేశారు.  కాగా, ముఖలింగం ఎమ్మెల్యే కూనకు అత్యంత సన్నిహితుడు. ఆయన అమరావతితో పాటు ఎక్కడకు వెళ్లినా వెన్నంటే ఉంటాడు. 

ఈ నేపథ్యంలోనే పలుకుబడి ఉన్న షాప్‌ యజమానిని తప్పించి వర్కర్లను బలి చేశారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేసును ఆమదాలవలస ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించారు. దుకాణాన్ని సీజ్‌ చేసి, నాగేశ్వరరావు, శ్రీనివాసరావులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపించినట్లు ఆమదాలవలస ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు. అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పల్లి మురళీధర్‌ ఆ«ధ్వర్యంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ మర్రాపు శ్రీనివాసరావు దాడుల్లో పాల్గొన్నారు. 

దుకాణమే అక్రమం.. 
పీఆర్‌ వైన్స్‌ దుకాణం నిబంధనలకు విరుద్ధంగా పాలకొండ ప్రధాన రహదారి పక్కనే, చర్చి సమీపంలో ఏర్పాటు చేయడం గమనార్హం. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వచి్చనా ఎక్సైజ్‌ అధికారులు చూసి వెళ్లారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు ఎక్సైజ్‌ శాఖలో ఓ ఉన్నతాధికారి అండదండలు సమృద్ధిగా ఉండడంతోనే పీఆర్‌ వైన్స్‌ యజమాని ఇష్టారీతిన వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 

సాక్షిపై దాడి ఘటనలో కీలకపాత్ర 
సాక్షి పత్రిక యూనిట్‌ కార్యాలయంపై జరిగిన దాడిలో పీఆర్‌ వైన్స్‌ యజమాని పైడి ముఖలింగం కీలక పాత్ర పోషించాడు. కార్యాలయం బయటి భాగం ధ్వంసం చేయడంలో ఇతడే ప్రధానంగా వ్యవహరించాడు. పెద్దల మెప్పు కోసం చాలా హడావుడి చేశాడు. 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)