Breaking News

సర్కారు ‘షోకాజ్‌’ కొరడా

Published on Tue, 08/20/2024 - 05:51

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ టెర్రరిజాన్ని పెంచిపోషి­స్తున్న ప్రభుత్వం ఇప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛనూ హరిస్తోంది. హత్యలు, దాడులు, దౌర్జన్యా­లతో ఇప్పటికే రాక్షసానందం పొందుతున్న టీడీపీ– జనసేన– బీజేపీ సర్కారు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛకు, అన్యాయంపై ప్రశ్నించే గొంతుకకు తావులేదన్నట్లుగా తన తీరును, భావ దారిద్య్రాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తోంది. ఇందుకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ.

దేశాన్ని కుదిపేసిన కోల్‌కత ఆర్జీ కార్‌ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనకు మద్దతుగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైద్యశాఖకు సంబంధించిన 33 మంది మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ)లు ర్యాలీ, ధర్నా నిర్వహించారు. పైఅధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇందులో పాల్గొన్నందుకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జమాల్‌ బాషా వీరికి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. 

ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించినట్లు బాషా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 24 గంటల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని.. లేనిపక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా అందులో  హెచ్చరించారు. నోటీసులు అందుకున్న 33 మందిలో 31 మంది మహిళలే ఉండటం గమనార్హం. నిజానికి.. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సంఘీభావం ప్రకటించి సానుభూతి చూపించాల్సిన ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా చీమకుట్టినట్లు కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో రిషితేశ్వరి.. ఇప్పుడు తాజాగా ఈ రెండు నెలల్లో ముచ్చుమర్రి, హోంమంత్రి వంగలపూడి ఇలాకా అనకాపల్లి జిల్లాల్లో బాలికల దారుణ హత్యలపై చలనంలేని మొద్దుబారిన కూటమి సర్కారు.. కోలకత ఘటనపట్ల స్పందించకపోగా అందుకు నిరసన వ్యక్తంచేసిన వారిపై కక్షసాధింపునకు దిగడాన్ని పౌరహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)