Breaking News

ఇసుక దందాను అడ్డుకుంటే అంతే..

Published on Sun, 10/27/2024 - 05:05

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తున్నారనడానికి శ్రీకాకుళంలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఉదాహరణ. నగరం నడిబొడ్డున ఈనెల 16న టీడీపీ నాయకుల దాడిలో ఆమదాలవలస నియోజక­వర్గానికి చెందిన సనపల సురేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయలేదుగానీ సురేష్‌ను మాత్రం అరెస్టు మీద అరెస్టు చేస్తున్నారు. 

దాడికి తెగబడడమే కాక.. టీడీపీ అతనిపై ఎదురు కేసు పెట్టి శనివారం అరెస్టు చేయించింది. అలాగే, వారం రోజుల క్రితం ఓ పాత కేసు­లోనూ అరెస్టుచేశారు. దీంతో ఆ పార్టీ నేతల వేధింపులు భరించలేక సురేష్‌ టీడీపీ సభ్య­త్వం తీసుకున్నా పచ్చమూకలు వదిలి­పెట్టలేదు. పైగా.. ఇసుక దోపిడీకి అడ్డుతగిలితే ఎవరికైనా ఇదేగతి అని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. 

అసలేం జరిగిందంటే..  
జిల్లాలోని ఆమదాలవలస మండలం దూసి గ్రామం ఎస్సీ కాలనీ సమీపంలోని నాగావళి నదిలో ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వి బావాజీపేట రబ్బర్‌ తయారీ ఇండస్ట్రియల్‌ యార్డులో నిల్వచేసి ఉంచారు. ఇది చూసి బూర్జ మండలం గుత్తావెల్లికి చెందిన సనపల సురేష్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవి అనుచరుడైన తొగరాం వాసి రవికాంత్‌ నేతృత్వంలోనే ఈ తంతు జరుగుతున్నట్లు శ్రీకాకుళం తహసీల్దారు గణపతి కూడా తేల్చారు. 

ఈ నేపథ్యంలో.. ఈనెల 16న ఇసుక నిల్వలను మీడియాకు చూపించడానికి సురేష్‌ వెళ్తుండగా ఆయనపై కొందరు దాడికి యత్నించారు. అక్కడి నుంచి సురేష్‌ తప్పించుకుని వస్తుంటే.. శ్రీకాకుళంలోని బలగ మెట్టు కూడలి వద్ద మళ్లీ అటకాయించి ఆయనను కారు నుంచి బయటకు లాగి మరీ దాడిచేశారు. సురేష్‌తో పాటు వచ్చిన చంద్రరావు అనే వ్యక్తిపైనా దాడిచేశారు. అంతకుముందు.. సెప్టెంబరు 27న కూడా కాఖండ్యాం ఇసుక ర్యాంపులో అక్రమాలను అడ్డుకున్నారని నారాయణపురం వద్ద సురేష్‌ కారును అడ్డగించి దాడిచేశారు.
 
డీఎస్పీ వద్ద విచారణకని పిలిచి అరెస్టు..
ఇసుక మాఫియాకు కొరకరాని కొయ్యగా తయారైన సురేష్‌ను శ్రీకాకుళంలో తనపై దాడి ఘటనకు సంబంధించి విచారణకని పోలీసులు పిలిచారు. టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు సురేష్‌ వచ్చారు. విచారణ పూర్తయ్యాక స్టేషన్‌ నుంచి బయటికి రాగానే రూరల్‌ పోలీసులొచ్చి అరెస్టుచేశారు. ఈనెల 16న జరిగిన ఘటనలో కారుతో గుద్దేసి ఇద్దరి ప్రమాదానికి కారణమయ్యాడనే కేసు కింద అరెస్టుచేసినట్లు ఎస్‌ఐ కె. రాము తెలిపారు.

కక్షపూరితంగా అరెస్టు చేశారు..
పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టుచేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్‌ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్‌మెంట్‌ రాసుకుంటామని చెప్పి సాకు‡్ష్యలు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అక్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్‌ ఎస్‌ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. 
– మౌనిక , సనపల సురేష్‌ భార్య 

కక్షపూరితంగానే అరెస్టు.. 
పోలీసులు నా భర్తను కక్షపూరితంగా అరెస్టు చేశారు. విచారణకని పిలిచి అరెస్టుచేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం రెండో పట్టణ పోలీసులు ఫోన్‌ చేశారు. 26న డీఎస్పీ విచారణ ఉందని రమ్మన్నారు. దీంతో శని­వారం మ«ధ్యాహ్నం 12.30కు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు సురేష్‌తో కలిసి వెళ్లాం. అక్కడ స్టేట్‌మెంట్‌ రాసుకుంటామని చెప్పి సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అ­క్కడే వందలాది మంది చూశారని చెప్పాం. సరే.. మీరు వెళ్లిపోండని సీఐ అనగానే బయటకు వచ్చేశాం. ఇంతలో రూరల్‌ ఎస్‌ఐ కె. రాము తమ సిబ్బందితో కలిసి నా భర్తను జీపులో ఎక్కించుకుని తీసుకుపోయారు. 
– మౌనిక, సనపల సురేష్‌ భార్య  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)