Breaking News

పురుగు మందు డబ్బాతో రోడ్డెక్కిన రైతు

Published on Thu, 12/11/2025 - 10:43

అయ్యంకి(మొవ్వ): ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనడం లేదని, ఇక తమకు ఆత్మ హత్యే శరణ్యమని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పురుగు మందు డబ్బా పట్టుకుని కుటుంబ సభ్యులతో రోడ్డెక్కాడు. ఈ ఘటన మొవ్వ      మండలం అయ్యంకి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ధాన్యం రోడ్ల పైనే ఎండపెట్టి తేమ శాతం 16 వచ్చినా రైతు సేవా        కేంద్రాల ద్వారా ధాన్యం కొనలేదు. ఇదే అదనుగా దళారులు రూ.1,200కు ఇస్తావా అని అడుగుతుండడంతో రైతులు దిక్కు దోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

అయ్యంకి గ్రామానికి చెందిన రాజులపాటి మోహనకృష్ణ పదెకరాలు కౌలుకు తీసు కుని వ్యవసాయం చేస్తున్నాడు. యంత్రాల ద్వారా ధాన్యం నూర్చి బుధవారం నాటికి 16 రోజులుగా ఎండపెట్టాడు. తేమ శాతం 16 వచ్చింది. రోజుకు రూ.3,200 కూలి ఖర్చవుతున్నా గత్యంతరం లేక ధాన్యం పాడవకుండా అరపెడుతున్నాడు. అయితే ధాన్యం అమ్ముడుపోక పోవటం, వేలకు వేలు అదనపు ఖర్చవటంతో ఆ రైతు పడుతున్న ఆవేదన వర్ణనా తీతంగా మారింది. దీంతో పురుగుమందు డబ్బా పట్టుకొని రోడ్డెక్కిన రైతు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ధాన్యాన్ని న్యాయమైన ధరకు కొనుగోలు చేసి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాడు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)