Breaking News

ఆగని ‘రక్తచరిత్ర’.. ఎదురొస్తే ఎవరినీ వదలం

Published on Thu, 05/15/2025 - 03:16

సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటా­ల శ్రీరామ్‌ దాషీ్టకాలతో నియోజకవర్గంలోని రామ­గిరి మండల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతు­కుతున్నారు. ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తారో, ఏ ప­రిణామాలు ఎవరి ప్రాణాలు తీస్తాయో.. అని వణికిపోతున్నారు. బలవంతంగా పార్టీలోకి చేర్చుకోవడం,అవసరమైతే దాడులు చేయడం రామగిరి మండలంలో టీడీపీ గూండాలకు పరి­పాటిగా మారింది. ఎంపీపీ ఉప ఎన్నికకు మరోసారి నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ‘రక్తచరిత్ర’ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. 

మార్చిలో జరగాల్సిన ఎంపీపీ ఉప ఎ­న్నికను టీడీపీ గూండాల దౌర్జన్యాలతో అధికారులు వాయిదా వేశారు. ఎంపీటీసీ సభ్యులను బెదిరించి కిడ్నాప్‌నకు యత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాపిరెడ్డిపల్లిలో కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు హతమార్చారు. పరామ­ర్శించడానికి వచి్చన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు పోలీసులు సరైన రక్షణ కల్పించలేదు. 

మరోసారి అలాంటి ఘట­నలు పునరావృతం కాకూడదనే ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్‌సీపీ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు. ఎంపీపీ స్థానానికి అభ్యర్థి కూడా లేని టీడీపీ వాళ్లు ఎలాంటి దారుణాలకు ఒడిగడతారోనని వైఎస్సార్‌సీపీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు భయపడుతున్నారు. 

బలవంతంగా టీడీపీలో చేర్చుకుని.. 
ఈ నెల 19వ తేదీన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగనుంది. ఎంపీపీ పదవి మహిళా అభ్యర్థికి రిజర్వు కావడంతో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి వేటలో పడ్డారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని మంగళవారం బలవంతంగా వెంకటాపురం తీసుకెళ్లి టీడీపీ కండువా వేసి పా ర్టీలో చేరినట్లు పరిటాల సునీత, శ్రీరామ్‌ ఫొటోలకు పోజులిచ్చారు. 

సాయంత్రం నుంచి భారతి ఎవరికీ కనిపించకుండా పోయారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలే కిడ్నాప్‌ చేశారంటూ టీడీపీ వారు దు్రష్పచారం చేశారు. వారి ప్రచారాన్ని భారతి ఖండిస్తూ తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని బుధవారం వీడియో విడుదల చేశారు.  

ఇంటిపై దాడి... పట్టించుకోని పోలీసులు 
టీడీపీలో చేరిన పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని ఎక్కడ దాచారో చెప్పాలంటూ కొత్తపల్లి గ్రామంలో కురుబ సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు నారాయణరెడ్డి ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి టీడీపీకి చెందిన మాదాపురం శంకర్‌తోపాటు మరికొంతమంది రౌడీలు దాడి చేశారు. 

ఈ ఘటన గురించి బుధవారం ఉదయం రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో పోలీసులపై నమ్మకం పోయిందని, ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఉంటే టీడీపీ గూండాలు పాపిరెడ్డిపల్లిలో లింగమయ్యను హత్య చేసిన తరహాలోనే దారుణానికి ఒడిగడతారని కొత్తపల్లి గ్రామస్తులు భయపడుతున్నారు.

ఎంపీపీ ఇస్తామన్నారు  
‘టీడీపీ నేతలు నన్ను భయపెట్టి బలవంతంగా వెంకటాపురం తీసు­­కెళ్లారు. పరిటాల సునీత, శ్రీరామ్‌ సమక్షంలో పార్టీ కండువా వేసి ఎంపీపీ పదవి ఇస్తామని ఆఫర్‌ చేశారు. నాకు ఎలాంటి పదవీ వద్దని చెప్పినా బలవంతపెట్టారు. ఆ తర్వాత మా గ్రామ­ంలో వదిలారు. అక్క­డ ఉంటే రక్షణ ఉండదని భావించి బంధువు­ల ఇంటికి వచ్చాను. నాకు టీడీపీలోకి వెళ్లడం ఇ­ష్టం లేదు. పదవి కంటే పార్టీ ముఖ్యం. వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతా. ఎంపీపీ ఉప ఎన్నికకు హాజరుకాలేను. ఈ నెల 20 తర్వాత గ్రామా­నికి వస్తాను. – భారతి, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు, పేరూరు–2

ఎన్నికను బహిష్కరిస్తున్నాం 
‘రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను వైఎస్సార్‌సీపీ బహిష్కరిస్తోంది. మార్చి 27న జరగాల్సిన ఎన్నిక టీడీపీ నాయ­కుల దౌర్జన్యాల కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కురుబ లింగమయ్యను కోల్పోయాం. మరోసారి ఇంకొందరు కార్యకర్తలను కోల్పోలేం. అందుకే ఎన్నికకు దూరంగా ఉంటాం. రామగిరి పోలీసులపై నమ్మకం లేదు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వస్తేనే సరైన రక్షణ కల్పించలేకపోయారు.’ – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)