Breaking News

ప్రభుత్వం మాదే.. మాపైనే కేసులా!

Published on Wed, 06/11/2025 - 02:21

రామసముద్రం: ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మా పార్టీ ప్రభుత్వమే. అలాంటిది మాపైనే కేసులు పెడతారా! మీకెంత ధైర్యం? ఆ ఎస్‌ఐని మాకు అప్పజెప్పండి. ఆయన సంగతి తేలుస్తాం’ అంటూ అన్నమయ్య జిల్లా ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పోలీస్‌ స్టేషన్‌పై దండెత్తారు. వివరాల్లోకి వెళితే.. ఎర్రబోయినపల్లి, శ్రీరాములవారిపల్లి గ్రామాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతల నేపథ్యంలో రెండువర్గాలపై రామసముద్రం పోలీసులు కేసులు నమోదు చేశారు. 

శ్రీరాములవారిపల్లెకు చెందిన మంజునాథ్‌ ఫిర్యాదు మేరకు ఎర్రబోయినపల్లెకు చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన ఎర్రబోయినపల్లి టీడీపీ శ్రేణులు స్టేషన్‌పైకి దూసుకొచ్చాయి. ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్‌ ఈ విషయాన్ని గమనించి స్టేషన్‌ గేటును మూసివేశారు. ఎవరినీ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసి మదనపల్లె రూరల్‌ సీఐ సత్యనారాయణ అక్కడకు చేరుకోగా.. ఆయన సమక్షంలోనే టీడీపీ శ్రేణులు పోలీస్‌ స్టేషన్‌ గేటును నెట్టుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 

తర్వాత అక్కడే ఆందోళన నిర్వహించారు. టీడీపీకి చెందిన తమపైనే కేసు నమోదు చేసేంత ధైర్యం మీకెవరు ఇచ్చారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనతో రామసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణుల దాడి యత్నంతో ఆందోళనకు గురైన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు. 

టీడీపీ నాయకుడు విశ్వనాథ్‌ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో మంజునాథ్‌ వర్గానికి చెందిన ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్టు ఎస్సై రవికుమార్‌ ప్రకటించారు. ఈ కేసులో ఇంకా చాలా మంది నిందితులు ఉన్నారని వారిపైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాష పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సీఐ, ఎస్సైలతో సమావేశమయ్యారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)