మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
టీడీపీ, జనసేన బాహాబాహి
Published on Fri, 01/31/2025 - 04:41
ఆదోని రూరల్: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. తాజాగా గురువారం రాత్రి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. నియోజకవర్గంలోని డీలర్‌షిప్‌ల వాటాల విషయంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద గుమిగూడారు.
నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నిర్వహిస్తున్న నిత్యావసర సరుకుల దుకాణాల డీలర్‌షిప్‌లను తొలగించి తమకు ఇవ్వాలని, ఈ విషయంపై తమ అధినేతలు జిల్లా కలెక్టర్, ఆ శాఖ మంత్రిని ఆదేశించారంటూ బాహాటంగానే చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలానా డీలర్‌షిప్ తమకు కావాలంటే తమకు కావాలని రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆదోని టూటౌన్ పోలీసులు అక్కడకు వచ్చి రెండువర్గాలకు సర్ధిచెప్పి శాంతింపచేశారు.
Tags : 1