విశాఖ ఉక్కు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి

Published on Tue, 09/17/2024 - 04:27

సీతమ్మధార: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీ, జనసేన పార్టీలను వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు డిమాండ్‌ చేశారు. సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. నేను పార్లమెంట్‌లో ప్రశ్నించగా.. ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగదని ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి బదులిచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతుందని చెప్పారు. ఎంతోమంది ప్రాణత్యాగంతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ కోసం పోరాడేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధం కావాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర నాయకులు వెంటనే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వారి వైఖరిని స్పష్టం చేయాలి.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గకపోతే.. టీడీపీ, జనసేన పారీ్టలు మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. రాష్ట్ర ప్రజల కోసం ఎన్డీయే నుంచి తప్పుకుంటారో? ప్రజలను మోసం చేస్తారో? చెప్పాలి. టీడీపీ, జనసేన వెంటనే ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకుంటే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. లేకపోతే లక్షలాది మంది ఉద్యోగులు, కారి్మకులు రోడ్డున పడతారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది’ అని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)