Breaking News

కూటమి నేతల ప్లాన్‌.. మైనర్లతో దొంగల ముఠా తయారీ

Published on Fri, 07/25/2025 - 04:41

సాక్షి ప్రతినిధి, విజయవాడ:  మైనర్లకు లిక్కర్, గంజాయి అలవాటు చేసి వారితో చోరీలు చేయిస్తూ రూ.కోట్లు వెనకేసుకున్నారు అధికార కూటమికి చెందిన ఇద్దరు నేతలు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఏడాదిగా సాగుతున్న ఈ దందా బండారం ఎట్టకేలకు బయటపడింది.  చోరీ చేసిన సెల్‌ఫోన్‌లో సిమ్‌ వేసిన మైనర్లు బుధవారం దొరికిపోవడంతో కూటమి నేతల పాపం పండింది. సేకరించిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం నవీన్‌మిట్టల్‌ కాలనీకి చెందిన జనసేన నేత బందరు పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉంటాడు.

ఈయన బందరు మండలం చినకరగ్రహారం గ్రామ శివారు పల్లెపాలెంకు చెందిన టీడీపీ నేత కొక్కిలిగడ్డ రాముతో జత కట్టి ఈజీగా డబ్బు సంపాదించాలని ‘మాస్టర్‌’ ప్లాన్‌ వేశారు. ముగ్గురు మైనర్లకు మాయమాటలుచెప్పి లిక్కర్, గంజాయి అలవాటు చేశారు. చోరీలకు పాల్పడేలా ముగ్గులోకి దింపారు. వారి చేత తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేయించారు. ఏడాదిగా దందా సాగిస్తున్నారు. ఇప్పటివరకు పదికిపైగా చోరీలు చేయించినట్టు సమాచారం. 100 గ్రాములు బంగారు ఆభరణాలతోపాటు సుమారు 700 గ్రాముల వెండి వస్తువులు, రూ.లక్షల్లో నగదును చోరీ చేయించారు. మైనర్లకు అడిగినప్పుడల్లా అవసరాలకు చిల్లర విసిరి, చోరీ సొత్తునంతా ఇద్దరు నేతలే పంచుకున్నారు. తెచ్చిన బంగారు ఆభరణాలన్నీ చిలకలపూడి బంగారమని మైనర్లను నమ్మించి మోసం చేసేవారు.  

పట్టించిన సిమ్‌  
ఇటీవల చోరీ చేసే సమయంలో నగదుతోపాటు సెల్‌ఫోన్‌ను అపహరించిన మైనర్లు ఆ ఫోన్‌లో సిమ్‌ తీసేసి కొంతకాలం దాన్ని దాచిపెట్టారు. ఇటీవల ఫోన్‌పై మోజుతో ఓ మైనర్‌ కొత్త సిమ్‌ తీసుకుని దానిలో వేశాడు. అప్పటికే నేరస్తుల కోసం  నిఘా పెట్టి ఉంచిన పోలీసులకు సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ట్రేస్‌ కావటంతో బుధవారం ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చే క్రమంలో కూటమి నేతల బండారం బయటపడింది. ఈ విషయం విని పోలీసులే నిర్ఘాంతపోయారు.  

మంత్రి ఫోన్‌తో 41ఏ నోటీసులతో సరి..!
విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు కూటమి నేతల అరెస్టుకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్‌ అయిన కంత్రీ నాయకులు మంత్రిని ఆశ్రయించారు. విషయం బయట పడితే కూటమి పరువు పోతోందని భావించిన మంత్రి కేసును నీరుగార్చాలని పోలీసులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీంతో పోలీసులు కూటమి నేతలను పిలిపించి 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత జనసేన నేతను ఏకంగా కేసు నుంచి తప్పించారు. ఇతని సోదరుడు జనసేన డివిజన్‌ అధ్యక్షుడు కావడం, పార్లమెంటు ముఖ్యనేత పీఏకు సన్నిహితంగా ఉండడంతో కేసు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. పోలీసులు రికవరీ చేసిన సొమ్ము కూడా తక్కువ చేసి, చూపినట్లు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతల మాయమాటలతో చోరీలకు పాల్పడిన ముగ్గురూ మైనర్లు కావడంతో కోర్టు వారికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)