Breaking News

కమ్మపల్లిలో ఆగని టీడీపీ అరాచకం

Published on Wed, 07/10/2024 - 04:51

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని కమ్మపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. పదిరోజుల నుంచి వైఎస్సార్‌సీపీ కుటుంబాలు గ్రామంలోంచి బయటకు వెళ్లకుండా, వెలుపల ఉన్నవారు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామంలో జరుగుతున్న ఆటవిక చర్యల గురించి సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. అయినా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. నాలుగు రోజుల కిందట టీడీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడినవారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియని దుస్థితి నెలకొంది.

రెండురోజుల కిందట పోలీసులు గ్రామంలోకి వెళ్లి ఇరువర్గాల వారితో మాట్లాడినా.. టీడీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో జరుగుతున్న దౌర్జన్యకాండ బయటకు పొక్కకుండా చూసేందుకు వారి ఫోన్లు కూడా లాగేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ గ్రామంలోకి పాల  సరఫరా నిలిపివేశారు. వైఎస్సార్‌సీపీ వారి పశువులకు గ్రాసం కూడా వేయనీయడంలేదని తెలిసింది. గ్రామంలోని వైఎస్సార్‌సీపీ కుటుంబాలకు చెందిన టమాటా దిగుబడులను మార్కెట్‌కు తరలించకుండా నిలిపేశారు. పొలాల్లో నాలుగు రోజులుగా నిల్వ ఉన్న టమాటా దిగుబడికి సంబంధించినవీడియోలు బయటకు వచ్చాయి.

గ్రామంలో సుమారు వెయ్యి బాక్సుల వరకు టమాటా నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక బాక్సు విలువ రూ.500కు పైనే. ఒకటి రెండురోజుల్లో మార్కెట్‌కు తరలించకపోతే ఈ టమాటా దిగుబడి మొత్తం కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టీడీపీ దౌర్జన్యకాండను జీర్ణించుకోలేని ఆ పార్టీ కార్యకర్త ఒకరు ఈవీడియోలు, ఫొటోలను వైరల్‌ చేసినట్లు తెలిసింది. మీడియా, పత్రికల వారికి పంపినట్లు సమాచారం. గ్రామంలో జరుగుతున్న టీడీపీ నేతల దాష్టీకంపై మానవహక్కుల కమిషన్‌ స్పందించాలని మానవతావాదులు కోరుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)