Breaking News

హెరిటేజ్‌ వాళ్లు మోసం చేశారు..

Published on Fri, 07/11/2025 - 07:36

సాక్షి, అమరావతి: ఇన్నోవా కారును హెరిటేజ్‌ కంటైనర్‌ ఢీ  కొట్టిన ఘటనలో నష్టపరిహారం చెల్లిస్తా­మని చెప్పిన హెరిటేజ్‌ సంస్థ ఆనక ముఖం చాటేసిందని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప తండాకు చెందిన టీడీపీ కార్యకర్త బాలునాయక్‌ ఆరోపించాడు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ  ఏడాది ఫిబ్రవరి నెల 23న అనంతపురంలో పెళ్లి వేడుకలకు హాజరై కుటుంబ సభ్యులతో ఇన్నోవా కారులో తిరిగి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తుండగా కర్నూలు–వెల్దుర్తి మధ్య తాము ప్రయాణిస్తున్న కారుని హెరిటేజ్‌ కంటైనర్‌ ఢీ కొందని తెలిపాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు  సంఘటనా స్థలంలోనే మరణించాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన హెరిటేజ్‌ వాళ్ళు నష్టపరిహారం చెల్లిస్తామని ఆరోజు మాట ఇచ్చారు. కానీ ఇంతవరకు పైసా విదల్చలేదని బాలునాయక్‌ వివరించాడు.

న్యాయం చేయమని వెళితే గెంటేశారు..
‘వైఎస్సార్‌ కడపలో జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను కలిశా. విష­యం చెప్పాను.  న్యాయం చేస్తానని  హామీ ఇచ్చారు. అయినా హెరిటేజ్‌ యాజమాన్యం న్యాయం చేయలేదు. క్యాబినెట్‌ సమావేశాల సందర్భంగా సచివాలయంలో లోకేశ్‌ చాంబర్‌ కి వెళ్లి మరోసారి విన్నవించా. అక్కడున్న సిబ్బంది మా బాధను ఏమాత్రం పట్టించుకోకుండా బయటకు నెట్టేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీనే నమ్ముకొని ఆ పార్టీలో ఉన్నాం. కానీ నమ్ముకున్న పార్టీ, హెరి­టేజ్‌ యాజమాన్యం మా కుటుంబానికి తీరని అన్యా­యం చేసింది.  ప్రమాదంలో గాయపడిన కుటుంబసభ్యుల చికిత్స కోసం ఇంటి స్థలం, ట్రాక్టర్‌ కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది’ అని బాలునాయక్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తనకు హెరిటేజ్‌ యాజమాన్యం, టీడీపీ న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్‌ చేశాడు.   

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)