Breaking News

చింత.. నిశ్చింత..

Published on Sat, 02/22/2025 - 05:54

సాక్షి, పుట్టపర్తి: అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో అనేక గ్రామాల ప్రజలు చింత చెట్టును నమ్ముకుని నిశ్చింతగా జీవనం సాగిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి దాదాపు 20 వేల కుటుంబాలు చింతచెట్లనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 334 గ్రామాలు ఉండగా.. సుమారు 2 లక్షల చింతచెట్లు (Tamarind Trees) ఉన్నాయి. ప్రధాన మార్కెట్‌ అయిన హిందూపురం (Hindupur) మార్కెట్‌కు వచ్చే సరుకులో అత్యధికంగా మడకశిర నుంచే వస్తుంది.  

గత మూడేళ్ల నుంచి చింత రైతులకు కూలీ వ్యయం బాగా పెరిగింది. చింతపండు ధర మాత్రం యథావిధిగా ఉండటంతో ఆశించిన స్థాయిలో లాభాలు రావడం లేదని రైతులు చెబుతున్నారు. చింతకాయలు కోసేందుకు కూలీలకు రోజుకు రూ.800 చొప్పున ఇవ్వాలి. మిగతా నూర్పిడి పనులకు అయితే రోజుకు రూ.300 ఇస్తారు.

చింతపండును శుద్ధి చేసి మార్కెట్‌కు తరలించేందుకు క్వింటాల్‌కు రూ.2 వేల చొప్పున అదనంగా భరించాల్సి ఉంటుంది. పండు బాగా ఉంటే నాణ్యత ఆధారంగా క్వింటాల్‌ రూ.30 వేల వరకు ధర పలుకుతుంది. సరుకు బాగా లేకపోతే ధరలో వ్యత్యాసం ఉంటుంది. కొందరు సరిగా శుద్ధిచేయలేక తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. 

హిందూపురం యార్డ్‌లో విక్రయాలు.. 
ఏటా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు వారానికి రెండు రోజులు (సోమ, గురు) చొప్పున హిందూపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో చింతపండు విక్రయాలు జరుగుతాయి. సీజన్‌లో గరిష్టంగా 28 సార్లు అమ్మకాలు ఉంటాయి. మార్కెట్‌ యార్డులో సుమారు 70 ట్రేడ్‌ ఏజెన్సీలు ఉన్నాయి. ఒక్కో ఏజెన్సీ నుంచి సగటున 100 టన్నుల చింతపండు ఎగుమతి అవుతుంది. అందులో సగంపైగా మడకశిర నియోజకవర్గం నుంచి వస్తుండటం విశేషం. మిగతా సరుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి చేరుతుంది.  

సీజన్‌ ముగిశాక శీతల గిడ్డంగుల్లోకి.. 
రైతుల నుంచి సేకరించిన సరుకును హిందూపురం మార్కెట్‌లో బాక్సుల్లో నింపి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. సీజన్‌ పూర్తయ్యే లోగా మిగిలిన సరుకును స్థానికంగా ఉన్న శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. లారీ చింతపండుకు ఏడాదికి రూ.25 వేలు చొప్పున అద్దె చెల్లించి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతారు. మడకశిరకు సమీపంలోనే హిందూపురం ఉండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలిసివస్తాయి. 

ఈ సారి ఖర్చు పెరిగింది 
గతంతో పోలిస్తే ఈసారి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేను 16 ఏళ్ల నుంచి చింత చెట్ల నుంచి ఫలసాయం పొందుతున్నా. ప్రతి ఏటా లాభాలు వచ్చేవి. అయితే ఈసారి మాత్రం ఖర్చు పెరిగింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం కల్పిస్తే రవాణా ఖర్చులు మిగులుతాయి.  
– రైతు జయరామప్ప, మెట్టబండపాళ్యం, మడకశిర మండలం 

దిగుబడి తగ్గింది 
మా తోట చుట్టూ 25 చింత చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది వింత రోగం వచ్చి దిగుబడి తగ్గింది. అందుకే ఒక్కో చెట్టును రూ.2 వేల చొప్పున వ్యాపారికి అమ్మేశాను. దిగుబడి బాగా ఉండి ఉంటే చెట్టు రూ.3 వేలు పైగా ధర పలికేది.  
– వీరాముద్దప్ప, మద్దనకుంట, అమరాపురం మండలం 

చింతపండు మార్కెట్‌ –  హిందూపురం 
లావాదేవీలు –  ప్రతి సోమ, గురువారం 
సీజన్‌ –  ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ 
యార్డ్‌లో ట్రేడ్‌ ఏజెన్సీలు – 70  
ఒక్కో ఏజెన్సీ నుంచి – 100 టన్నులవరకు ఎగుమతి

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)