Breaking News

నిరాశ్రయులకు ఓటు హక్కు కల్పించేలాచర్యలు చేపట్టండి

Published on Fri, 08/04/2023 - 04:23

సాక్షి, విశాఖపట్నం: అర్హత కలిగి ఉండి.. నిరాశ్ర­యులుగా ఉన్నవారికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్కుమార్‌ వ్యాస్‌ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ–­2024పై రెండు రోజుల సమీక్ష విశాఖలో గురు­వారం ముగిసింది.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్‌ మీనా అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ హృదేశ్‌కుమార్, సీనియర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నరేంద్ర ఎన్‌ బుటాలియా, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌కుమార్‌ హాజరయ్యారు.  

ప్రత్యేక సంక్షిప్త సవరణపై అవగాహన 
కలెక్టర్లకు ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌)–2024పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మానవ వనరుల లభ్యత, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్, పోలింగ్‌ స్టేషన్ల రేషనలైజేషన్, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్‌ స్టేషన్లకు కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ముగింపు సందర్భంగా సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ధర్మేంద్ర శర్మ, నితీష్కుమార్‌ వ్యాస్‌ మాట్లా­డుతూ అర్హులైన వారందర్నీ ఓటరు జాబితాలో 100 శాతం చేర్పించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్‌ కృషి చేయాలన్నారు.

ముఖ్యంగా నిరాశ్రయులపై శ్రద్ధ వహించాలనీ, అట్టడుగు సమాజంలో ఉన్న వారిని, మురికివాడలు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, గిరిజన తండాల్లో నివాసితులు, పీవీజీటీ పరిధిలో (బలహీన గిరిజన సమూహాలు) ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ అనంతరం ఓటర్ల నమోదుపై వచ్చే ప్రతి ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలని సూచించారు.

రాజకీయ పార్టీలకు ఓటింగ్, ఎన్నికల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈవీఎంలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లు, వలస ఓటర్లపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్‌ఎస్‌ఆర్‌–2024 ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అర్హులైన ఓటర్లతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకంగా ఉన్న ఓటర్ల జాబితా తయారు చేసేందుకు 26 జిల్లాల కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని ధర్మేంద్రశర్మ, నితీష్‌ ఆదేశించారు.

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)