Breaking News

తాడిపత్రిలో టెన్షన్‌.. ఎస్పీ జగదీష్‌ తీరుపై చర్చ

Published on Wed, 05/07/2025 - 11:33

సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ జగదీష్ వివాదం చిక్కుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఓవరాక్షన్‌ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన జాప్యం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రికి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్తేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్పీ జగదీష్‌కు ఇచ్చేందుకు పెద్దారెడ్డి అపాయింమెంట్‌ తీసుకున్నారు. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎస్పీ అపాయింట్‌మెంట్‌కు అనుమతి ఇవ్వలేదు. గత మూడు రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎస్పీ జగదీష్ జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీ, ఎస్పీలకు వాట్సాప్ ద్వారా పెద్దారెడ్డి సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తాడిపత్రి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని కోరారు. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్‌ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం ప్రభాకర్‌ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.

మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది. 
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)