10 నిమిషాల్లో 200 మంది పోలీసులను దించుతా..!

Published on Sun, 12/28/2025 - 09:03

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు గంటపాటు హైడ్రామా నడిచింది. తన కొడుకుతోపాటు మరో ముగ్గురిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టారని శనివారం రాత్రి ఓ మహిళ రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.  బాధితురాలు నాగమణి తెలిపిన వివరాల ప్రకారం... సోమవారం ఉదయం తాడేపల్లి ఎస్‌ఐ సాయి తమ ఇంటికి వచ్చి తన కుమారుడిని గంజాయి విక్రయిన్నాడనే ఆరోపణలతో స్టేషన్‌కు తీసుకెళ్తున్నామని చెప్పారన్నారు. ఆధార్‌ కార్డు, ఇతర ప్రూఫ్‌లు ఇస్తే పంపించేస్తామని నమ్మబలికారని తెలిపారు. అవన్నీ తీసుకున్నాక స్టేషన్‌లో కాకుండా పక్కన వేరే గదిలో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. 

తమ కుమారుడు తేజ ముంతతోపాటు గాందీనగర్‌లో నివసించే దినేష్‌ ప్రేమ్‌చంద్, యర్రబాలెంలో నివాసం ఉండే పవన్‌లను కూడా ఇదే తరమాలో తీసుకొచ్చారని ఆరోపించారు. దీనిపై నిలదీస్తే అసభ్య పదజాలంతో తనను దూషించారని వాపోయారు. ఇంతలో ఒక నాయకుడు అటుగా రావడంతో సీఐ అరాచకాలను నారా లోకేష్‌ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కాళ్లు పట్టుకుని ఆమె బతిమిలాడారు. ఓ నాయకుడు ఆ మహిళను సీఐ వద్దకు తీసుకెళ్లగా అందరి సమక్షంలోనే ‘‘200 మంది పోలీసులను 10 నిమిషాల్లో దించుతాను. మర్యాదగా చెప్పింది చెయ్యి. కపట్రాల తిప్పలో నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూశాను. ఎవరు ఏం చేస్తారో చూస్తాను’’ అంటూ పెద్దపెద్దగా మాట్లాడారు. 

విధులకు ఆటంకం కలిగించినట్లు ఆమెపై కేసు పెట్టండని సిబ్బందిని ఆదేశించారు. మరో మహిళ కూడా సీఐ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదంతా చూసి ఎస్‌ఐలు అవాక్కయ్యారు. సోమవారం అదుపులోకి తీసుకున్న వారిపై శనివారం ప్రకాషః్‌ నగర్‌ శ్మశానవాటిక వద్ద పట్టుకున్నట్లు కేసు నమోదు చేయడం ఏంటని, ఇది తమ తలకు చుట్టుకునేలా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సక్రమంగా ఉన్నతాధికారులు విచారణ చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.    

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)