Breaking News

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం

Published on Mon, 11/10/2025 - 16:29

సాక్షి,తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీ యూనివర్సిటీ)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సైకాలజీ విభాగంలో చోటుచేసుకున్న ఈ ఘటన విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ఈ ఘటనపై నలుగురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన విద్యార్థులపై కక్ష్య సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. వారిని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడికి గురిచేశారు. అంతేకాక, వారిపై బెదిరింపులకు కూడా దిగినట్లు సమాచారం.

ఈ ఒత్తిడిని భరించలేక, నలుగురు విద్యార్థులు తమ టీసీలు తీసుకుని యూనివర్సిటీని విడిచిపెట్టారు. ర్యాగింగ్ ఘటనలో ప్రమేయం ఉన్న ఆరుగురు సీనియర్ విద్యార్థులతో పాటు, సైకాలజీ విభాగ హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఓడీ) ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. విద్యార్థుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు యూనివర్సిటీ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ర్యాగింగ్‌ను ప్రశ్నించిన విద్యార్థి నాయకులపై కూడా బెదిరింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)