Breaking News

‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం

Published on Mon, 04/28/2025 - 10:20

సాక్షి,విజయవాడ: ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉర్సాకి రూ.3వేల కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, ఊరుపేరు లేని ఉర్సాకి వేలకోట్ల భూముల్ని కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆఫీస్‌,ట్రాక్‌ రికార్డ్‌  లేని ఉర్సాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.

రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఆఫీసు లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం ఘోస్ట్‌ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది! పూర్తిగా చట్టవిరుద్ధం! 59.6 ఎకరాలు ఘోస్ట్‌ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.  

ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..!  మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? అంటూ ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్సాకి భూ కేటాయింపులపై అనుమానాలు తలెత్తతున్నాయి.

అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్‌పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నోరు మెదకపోవడం గమనార్హం. ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్‌తో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బంధం బయటపడటంతో ఉర్సా ల్యాండ్ డీల్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చాంశనీయంగా మారింది.  

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)