Breaking News

వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Published on Tue, 09/16/2025 - 15:18

ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్‌ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్‌.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని  ఏఎస్‌జీ తెలిపారు.

‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్‌ వాదనలపై  సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్‌ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న  సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్‌ కోర్టులో ఎందుకు  చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్‌ రన్‌ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

 

	సుప్రీంకోర్టులో వివేకా హత్య కేసు విచారణ

కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్‌ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.

ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్‌ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది.

 

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)