Breaking News

ఏ1 నుండి ఏ5 వరకు టీడీపీ నేతలే: సుప్రీంకోర్టు

Published on Thu, 09/04/2025 - 13:15

ఢిల్లీ: పిన్నెల్లి సోదరులపై హత్య కేసు నమోదు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు ఉన్నది టీడీపీ వారే అని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి (ఏ7) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన​్‌పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిన్నెల్లి సోదరుల తరఫు లాయర్‌ వాదనలు వినిపిస్తూ..‘రాజకీయ కక్షతో పెట్టిన కేసు ఇది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయకముందే ఫిర్యాదుదారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వల్లే జరిగిన హత్య ఇది. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించింది అని తెలిపారు.

అనంతరం, ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నిందితులంతా హత్యకు గురైన వ్యక్తి పార్టీ వారే కావడం విచిత్రం. ఈ కేసులో ఏ1 నుంచి ఏ5 వరకు టీడీపీవారే ఉన్నారు అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)