Breaking News

కొమ్మినేనికి భారీ ఊరట

Published on Thu, 08/14/2025 - 14:13

సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ డిబేట్ కేసులో సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు భారీ ఊరట లభించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తాజాగా పర్మినెంట్‌ బెయిల్‌గా మారుస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. అదే సమయంలో గతంలో లైవ్‌ షో విషయంలో ఇచ్చిన ఆదేశాలనూ సవరించింది.  దీంతో ఈ కేసు విచారణ ముగిసినట్లయ్యింది. 

సాక్షి చానెల్‌లో ఓ గెస్ట్‌ చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఎలాంటి విచారణ చేయకుండానే కొమ్మినేని శ్రీనివాసరావును జూన్‌ 9వ తేదీన ఏపీ పోలీసులు నేరుగా అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. జూన్‌ 13వ తేదీన కోర్టు మధ్యంతర బెయిల్‌​ మంజూరు చేసింది. అదే సమయంలో సాక్షి టీవీ డిబేట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం గురువారం తొలగించింది. 

టీవీ షో లో గెస్టు చేసే  పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతించవద్దంటూ మధ్యంతర బెయిల్‌ సమయంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే లైవ్‌లో చేసే గెస్ట్‌లు చేసే వ్యాఖ్యలను ఎలా కంట్రోల్ చేయగలమన్న కొమ్మినేని తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో ఆ ఆదేశాలను జస్టిస్ బీవీ నాగరత్న, కేవీ విశ్వనాథ్ ధర్మాసనం సవరించింది. 

అదే సమయంలో.. అరెస్ట్ విషయంలో ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్  తప్పనిసరిగా పాటించాలని, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే  కేసుల్లో ముందుగా 41 ఏ నోటీసు ఇచ్చి ప్రాథమిక విచారణ చేయాలని  ఏపీ పోలీసులకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో కొమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.

మధ్యంతర బెయిల్‌ తీర్పు సమయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..  గెస్ట్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే.. యాంకర్‌ను ఎలా బాధ్యుడ్ని చేస్తారు?. కేవలం టీవీ డిబేటలో నవ్వినంత మాత్రానా అరెస్ట్‌ చేస్తారా? అలాగైతే కోర్టులో విచారణ సందర్భంగా చాలాసార్లు మేం నవ్వుతాం. వాక్‌ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయాలి అని సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే సెలవుల కారణంగా మూడు రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)