Breaking News

పవన్‌పై సుగాలి ప్రీతి తల్లి ఆ‍గ్రహం

Published on Thu, 08/28/2025 - 12:07

సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. అలాగే, లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా? అని అడిగారు. పవన్‌.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు.

సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుగాలి పార్వతి మాట్లాడుతూ.. నా కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా తరువాత ఈ కేసును పవన్‌ కల్యాణ్‌ గాలికి వదిలేశారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్‌పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

అసెంబ్లీ సమావేశాల్లో నా కూతురు కేసుపై చర్చించాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సీబీఐ విచారణ జరిపించాలి. సేనతో సేనాని అంటున్నారు.. నా కూతురుకి మాత్రం న్యాయం చేయలేకపోయారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితకు శ్రీకాంత్‌ పెరవలిపై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదు. ఎమ్మెల్సీ అనంత విషయంలో ఉన్న ఆత్రుత నా కూతురు విషయంలో లేదు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని మంత్రి అనితను అడుగుతున్నాను.

గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపైయిన్‌ చేస్తాం. నిరాహార దీక్షకి కూడా పూనుకుంటాం. ఎనిమిది సంవత్సరాలు అవిటి తనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా?. లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు?. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం’ అని వ్యాఖ్యలు చేశారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)