Breaking News

పాపాహోం నుంచి శాటిలైట్‌ సెంటర్‌కు..

Published on Mon, 03/10/2025 - 08:22

సీతమ్మధార: తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆ బాలిక భవిష్యత్‌ అంధకారంలో పడిపోతుందనుకున్నారు. అమ్మమ్మ అన్నీ అయి చదివించారు. సీతమ్మధార పాపాహోంలో(Seethammadhara) ఉంటూ చదువుకున్న ఆమె ప్రస్తుతం ఉన్నతోద్యోగం చేయడం విశేషం. దీంతో త్వరలోనే పాపాహోం ఆవరణలో ఆమెకి ఘనంగా సత్కారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యువతి విజయగాథ మనమూ తెలుసుకుందాం. 

గూడూరుకు చెందిన  భట్టిపాటి ప్రియాంక (21)(Bhattipati Priyanka) విశాఖ జిల్లా తగరపువలసలో మేనమామ వద్ద ఉంటూ చదువుకునేది. 9వ తరగతి చదివే సమయంలో 2017లో పాపాహోంలో చేరింది. సీతమ్మధారలోని డాల్ఫిన్ స్కూల్లో 9, పది చదివింది. ఈమెకి తల్లి లేరు. తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. ప్రియాంక డిప్లమో ఇన్‌ కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ (డీసీసీ) పూర్తి చేసింది. తర్వాత  నెల్లూరు జిల్లాలో డీకేడబ్ల్యూ కళాశాలలో బీకామ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ బ్రాంచ్‌లో (సీఏ)లో చేరింది.

 భీమునిపట్నం పాలిటెక్నిక్‌ కళాశాలలో పాపాహోం ఆర్థిక సాయంతోనే డిప్లమో చదివింది. ఈ కళాశాల నుంచి విద్యార్థుల వివరాలు పంపడంతో శ్రీహరికోటలోని స్పేస్‌ సెంటర్‌లో ఏడాది పాటు అప్రెంటిస్‌ శిక్షణకు ఎంపికై శిక్షణ తీసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ శిక్షణ పూర్తి అయింది.  ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో అకౌంట్స్‌లో సీహెచ్‌ఎస్‌ఎస్‌ పోస్టులో కాంట్రాక్ట్‌ విధానంలో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమెకి రూ.22 వేల వేతనం అందుతోంది.  

రాకెట్‌ లాంచింగ్‌ ఉద్యోగమే లక్ష్యం.. 
నేను 2003లో గూడూరులో పుట్టాను. 2008లో నా తల్లిదండ్రులు విడిపోయారు. గూడూరులోని అమ్మమ్మ వద్దే పెరిగాను. విశాఖలోని పాపాహోంలో ఉంటూ డాల్ఫిన్  స్కూల్లో 9వ తరగతిలో చేరాను. అక్కడే పదో తరగతి పూర్తి చేశాను. భీమిలిలో డిప్లమో చేశాను. 2018లో తల్లి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. రాకెట్‌ లాంచింగ్‌ సెంటర్‌లో ఉద్యోగమే ధ్యేయంగా పని చేస్తున్నాను. గూడురులో అమ్మమ్మ బాగోగులు నేనే చూస్తున్నాను. 
– ప్రియాంక, బెంగళూరు.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)