మారేడుమిల్లి జలపాతంలో ముగ్గురు గల్లంతు

Published on Mon, 09/23/2024 - 06:21

మారేడుమిల్లి: విహారయాత్ర కోసం ఏలూరులోని ఆశ్రం వైద్య కళాశాల నుంచి 14 మంది మెడికోలు అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని జల తరంగిణి జలపాతం వద్దకు రాగా.. విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో స్నానాలు చేస్తుండగా భారీవర్షం కురిసి ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు విద్యార్థినుల్ని 6 కిలోమీటర్ల దూరంలో స్థానికులు రక్షించగా.. ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.

మరో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఏలూరులోని ఆశ్రం మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సెకండియర్‌ చదువుతున్న 14 మంది విద్యార్థులు వ్యాన్‌లో ఆదివారం విహారయాత్రకు మారేడుమిల్లి వచ్చారు. అక్కడి నుంచి జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా భారీ వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా జలపాతం పొంగింది. దీనిని గమనించిన 9 మంది విద్యార్థులు వెంటనే బయటకు వచ్చేశారు.  

జలపాతం మధ్యలో చిక్కుకుపోయి.. 
జలపాతం మధ్యలో ఉండిపోయిన సీహెచ్‌.హరి­దీప్, కె.సౌమ్య, బి.అమృత, గాయత్రీ పుష్ప, హరిణిప్రియ కొట్టుకుపోయారు. వీరిలో గాయత్రీపుష్ప, హరిణిప్రియ 6 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం ప్రధాన రహదారి కల్వర్టు వద్ద చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు ఒడ్డుకు చేర్చారు. మిగతా ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో మార్కాపురానికి చెందిన సీహెచ్‌ హరిదీప్, విజయనగరానికి చెందిన కె.సౌమ్య, బి.అమృత  ఉన్నట్టు ఎస్‌ఐ రాము తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)