Breaking News

బిగిసిన సంకెళ్లకు బెదరని పిడికిళ్లు

Published on Sat, 01/10/2026 - 05:48

గాందీనగర్‌(విజయవాడసెంట్రల్‌)/లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌)/నరసరావుపేట/కర్నూలు(సెంట్రల్‌): ఉక్కు సంకెళ్లు బిగిసినా సంకల్పం సడలలేదు. పిడికిలెత్తిన విద్యార్థిలోకం బెదరలేదు. సర్కారు తీరుపై గళమెత్తి గర్జిస్తోంది. రెడ్‌ బుక్‌ రాజ్యాంగ పాలనపై సమరభేరి మోగిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కదంతొక్కారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌  వెంటనే విడుదల చేయాలని, జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేయాలని నినదించారు. అక్రమ కేసులపై కన్నెర్రజేశారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నేతలపై రౌడీషిట్లు ఓపెన్‌ చేసి, అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడడాన్ని ఖండించారు.

 శుక్రవారం విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నల్లరిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని ప్రభుత్వానికి  నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రవిచంద్ర, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాజేంద్ర బాబు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొరివి చైతన్య, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.వలరాజు, పీడీఎస్‌ యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్‌ పాల్గొన్నారు. 

వారు మాట్లాడుతూ  హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రౌడీషీట్లు తెరిచి అక్రమ ఆరెస్ట్‌లకు పాల్పడడం తగదని పేర్కొన్నారు.  ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ‘మెగా డీఎస్సీ’, ‘జాబ్‌ క్యాలెండర్‌’, నిరుద్యోగభృతి ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ హామీలను అమలు చేయాలని కోరడం నేరమా! అని  ప్రశ్నించారు. విశాఖలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను  ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి శివారెడ్డి, పార్టీ యువజన విభాగం నేతలు పాల్గొన్నారు.  

⇒ గుంటూరు కలెక్టరేట్‌ వద్ద  ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌ జీ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు.    
⇒ పల్నాడు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.  వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, ఏఐవైఎఫ్, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు పాల్గొన్నారు.  

⇒ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగులకు ఉద్యోగాలైనా ఇవ్వాలని.. లేదా నెలకు నిరుద్యోగ భృతి రూ.3 వేలైనా ఇవ్వాలంటూ విద్యార్థి, యువజన సంఘాల వేదిక కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఉరితాళ్లతో వినూత్న నిరసన  చేపట్టింది.  ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి సోమన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్‌ పాల్గొన్నారు. 

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)