Breaking News

బలపడుతున్న అల్పపీడనం 

Published on Fri, 12/01/2023 - 03:03

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి :  ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారనుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మరింత బలపడి 3వ తేదీ మధ్యాహ్నం కి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తుపానుగా మారనుంది.

మరోవైపు.. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని దక్షిణ శ్రీలంకపై సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటరలఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. తుపాను ప్రభావం కోస్తా తీరం వెంబడి ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వెల్లడించారు. 

రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి 
తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ ఆదేశించారు. ఖరీఫ్‌ వరి పంట కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున.. కోతలు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. కోతల్లో, కొనుగోళ్ల సమయంలో ఒక్క రైతు కూడా నష్టపోకూడదని చెప్పారు.

ఆయన గురువారం వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఖరీఫ్‌లో తక్కువ వర్షపాతం నమోదైనందున క్షేత్రస్థాయి సిబ్బంది లక్ష్యం మేరకు పంట కోత ప్రయోగాలపై దృష్టి పెట్టాలన్నారు. జియో కోఆర్డినేట్‌లతో కూడిన యాప్‌లో ప్రైమరీ వర్కర్, పర్యవేక్షక అధికారి, ఇన్సూ్యరెన్స్‌ కంపెనీ కోఅబ్జర్వర్ల సంతకాలతో పూర్తి స్థాయి సమాచారాన్ని రియల్‌ టైమ్‌లో నమోదు చేస్తేనే పంటల బీమాకు అర్హత వస్తుందని తెలిపారు.

ఈ క్రాప్‌ నమోదుకు ఖరీఫ్‌లో ఇచ్చిన మార్గదర్శకాలే రబీలోనూ వర్తిస్తాయన్నారు. త్వరగా కోతకు వచ్చే శనగ, మినుము, మొక్క జొన్న పంటలను త్వరగా ఈ క్రాప్‌ ద్వారా నమోదు చేయాలని సూచించారు. వచ్చే 3, 4 రోజుల్లో కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకునేందుకు రైతులకు అవసరమైన విత్తనాలను అందించాలని సూచించారు. శనగ విత్తనాల కోసం డిసెంబర్‌ 15 లోగా ఇండెంట్‌ పెట్టాలన్నారు.

దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలోనే గ్యాప్‌ సర్టిఫికేషన్‌ను అమలు చేస్తున్నందున, ఎక్కువ మంది లబ్ధి పొందేలా కృషి చేయాలని తెలిపారు. ఉత్తమ ప్రమాణాలను పొందిన ఉత్పత్తులకు గిరాకీ పెరిగేలా వివిధ మాధ్యమాల ద్వారా వినియోగదారులకు సమాచారం అందించాలన్నారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)