Breaking News

సీడ్‌ ల్యాబ్‌పై శీతకన్ను

Published on Tue, 11/05/2024 - 05:27

సాక్షి, మచిలీపట్నం: రైతులకు దిగుబడి బాగా రావాలంటే.. విత్తనం బాగుండాలి. కల్తీలేని విత్తనాలు అందిస్తేనే.. మొక్క బాగా పెరుగుతుంది. చీడపీడలు, వాతావరణ మార్పులను తట్టుకొని నిలుస్తుంది. అప్పుడే పంట దిగుబడి అధికంగా వస్తుంది. ఈ ఆలోచనతోనే రైతులకు మేలు చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 

కృష్ణా జిల్లా గన్నవరంలో రూ.45.80 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టి.. 70 శాతం పనులు కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ రావడం.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇది అందుబాటులోకి వస్తే.. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసే అవకాశమున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. 

వారణాసి తరహాలో.. 
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జాతీయ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం తరహాలో రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ సంకల్పించారు. రాష్ట్రంలో విత్తన పరిశోధన, శిక్షణ మరింత శాస్త్రీయంగా, పటిష్టంగా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో డాక్టర్‌ వైఎస్సార్‌ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పేరుతో నిర్మించేందుకు 2023 మార్చి 24న శంకుస్థాపన చేశారు. 

రూ.45.80 కోట్లతో 8 ఎకరాల్లో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పరిపాలన, శిక్షణ కేంద్రంతో పాటు వసతి, సిబ్బంది నివాసాలు, టెస్ట్‌ ఫామ్, విత్తన పరీక్ష ప్రయోగశాల, గ్రీన్‌ హౌస్, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, గోడౌన్, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు తదితరాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు. 

పూర్తయితే ప్రయోజనాలెన్నో.. 
» రాష్ట్ర స్థాయిలో సంబంధించిన అన్ని విత్తన ఏజెన్సీలు, సంస్థలకు ఉమ్మడి వేదిక అవుతుంది. 
»   విత్తన ప్రయోగశాలలు, అగ్రి ల్యాబ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి అధునాతన శిక్షణ లభిస్తుంది. 
»   వ్యవసాయ పట్టభద్రులు, డిప్లొమా చేసిన వారికి మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించేలా శిక్షణ ఇస్తారు. 
»   సీడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రపంచంలోని అత్యున్నత సంస్థలతో సమన్వయం చేసుకోవచ్చు. 
» జీన్‌ బ్యాంకు ఏర్పాటు వల్ల అన్ని పంటల సంరక్షణకు కృషి చేయొచ్చు. కొత్త, అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల విత్తన రకాల అభివృద్ధి సాధ్యపడుతుంది.

అలా వదిలేయడం సరికాదు.. 
వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మనది. రైతులకు అన్ని విధాలా మేలు చేకూర్చే విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం ఏర్పాటు చాలా అవసరం. నకిలీ విత్తనాలను నివారించొచ్చు. కొత్తరకం వంగడాలు, వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు సమకూరుతాయి. గత ప్రభుత్వం మొదలుపెట్టిందని.. ఈ ప్రభుత్వం వదిలేయడం సరికాదు. రాజకీయ పార్టీలకు అతీతంగా తగిన నిధులు సమ­కూర్చి రాష్ట్ర స్థాయి విత్తన పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు పూర్తి చేయాలి.   – కె.ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)