టార్గెట్‌ 5 లక్షలు

Published on Fri, 05/02/2025 - 05:00

సాక్షి నెట్‌వర్క్‌: అమరావతి రాజధాని పునః­ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వ పెద్దల టార్గెట్‌ మేరకు జన సమీకరణ చేసేందుకు అధి­కార యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ప్రతి జిల్లా నుంచి.. ప్రతి నియోజ­క­వ­ర్గం నుంచి ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్‌ బస్సుల్లో జనా­న్ని తరలించేందుకు ఏర్పాట్లు పూర్త­య్యా­యి. వచ్చి తీరా­ల్సిం­దేనని, లేదంటే నష్టపో­తా­రంటూ భయ­పెట్టి.. డ్రాక్రా మహిళలు, ఉపాధి కూలీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆ చివర ఉన్న అనంతపురం మొదలు.. ఈ చివర ఉన్న శ్రీకాకుళం వరకు టీడీపీ నేతలు, అధి­కారులకు టార్గెట్‌ నిర్దేశించా­రు.

ప్రధాని మోదీ పాల్గొనే సభకు 5 లక్షలకు మించి జనం ఉండేలా చూడాలని ప్రభు­త్వ పెద్దలు దిశా నిర్దే­శం చేశారు. జన సమీక­రణలో ఎవరికీ మినహా­యింపు లేదని తెగేసి చెప్పడంతో ఉన్నతాధికా­రులు, కూటమి నేతలు నేరుగా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ జన సమీ­కరణకు ఏర్పా­ట్లు చేశారు. భారీగా వాహ­నాలు సమకూ­ర్చాల్సి రావడంతో కొన్ని చోట్ల ప్రభుత్వ సిబ్బందిపై ఈ భారం పడుతోంది. వాహనాల ఖర్చును తహసీల్దార్లు, డీఆర్డీఏ పీడీలు ఇతర సిబ్బందిపై రు­ద్దారు. జన సమీకరణ బాధ్యత డ్వాక్రా సంఘా­ల లీడర్లపై మోపారు. 

వారికయ్యే భోజనం, బస్సు­ల డీజిల్‌ ఖర్చులు కూడా అధికా­రులే చూసు­కోవాలని కొన్ని చోట్ల ఆదేశించడంతో వా­రు ఉక్కిరిబిక్కిరి అవుతు­న్నా­రు. అమరావతికి వెళ్లే వాహనాలకు అనుమతులు లేవ­ంటూ ఇబ్బంది పెట్టొద్దని రవాణా శాఖ అధికా­రులకు ఆదేశాలు అందాయి. దీంతో స్కూలు, కాలేజీల బస్సులను జన సమీకరణ కోసం కేటా­యించారు. యజమా­నులతో మాట్లాడి ప్రైవేటు వాహనా­లను కూడా సభకు పంపించాలని ఒత్తిడి తెచ్చా­రు.

 రాజధాని సమీప జిల్లాల నుంచి విద్యా­ర్థులను కూడా తరలించాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో అధికా­రులు ఆ ప్రాంతాల్లోని కాలేజీల యాజమాన్యాలతో మాట్లా­డారు. మొత్త­ంగా వేలాది ఆర్టీసీ బస్సు­లను జన సమీకరణకు కేటాయించడంతో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రయాణి­కులు తీవ్ర ఇబ్బందులు ప­డ్డారు. శుక్ర­వారం కూడా ప్రజ­లకు ఈ ఇబ్బందులు తప్పవు. ఒక్క గుంటూరు జిల్లా నుంచే 1,241 బస్సులు కేటాయించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)