Breaking News

చేతులెత్తేసిన ప్రభుత్వం.. అన్నింటికీ ఇక పీపీపీ మంత్రం!

Published on Sun, 11/23/2025 - 04:58

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అన్నింటికీ పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం) మంత్రమే జపిస్తోంది. ప్రజలకు అవసరమైన ఏ నిర్మా­ణాలైనా తమవల్ల కాదని చేతులెత్తేసింది. సా­మా­జిక మౌలిక సదుపాయాల ప్రాజె­క్టులన్నింటినీ పీపీపీ విధానంలోనే చేపట్టాలని నిర్ణ­యించారు. ఆస్ప­త్రు­లు, తాగునీటి ప్రాజె­క్టులు, గ్రామీణ రహదారులు, ప్రభుత్వ పార్కులు, బస్‌ స్టాండ్‌లు.. ఇలా ఏ అభివృద్ధి పనులైనా సరే పీపీపీ విధానంలోనే చేపట్టాలని చంద్రబాబు నిర్ణ­యం తీసుకున్నారు. 

అసెంబ్లీ నియో­­జ­కవర్గాల్లో ప్రైవేట్‌ రంగంలో ఆస్పత్రుల నిర్మా­ణా­లను చేప­ట్టా­లని.. చిన్నా, పెద్దా అన్నీ కలిపి పీపీపీ­లో 302 ప్రాజె­క్టులను చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు డీపీ­ఆర్‌లను సిద్ధం చేయగా, మరి కొన్నింటికి డీపీ­ఆర్‌లు రూపొందిస్తున్నారు. సేవా రు­సుము ఆధా­రిత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్య­ంగా ము­ందుకు సాగా­లని సీఎం చంద్రబాబు ఇటీ­వల అధికా­రులతో జరిగిన పీపీపీ ప్రాజెక్టుల సమా­వేశంలో స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం కన్నా, సేవా రుసుము ఆధారిత మౌలిక సదుపాయాలను అందించడం పట్ల పౌరుల ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందని, అందుకు అనుగుణంగా సామా­జిక మౌలిక సదుపాయాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. అంటే పీపీపీ విధానంలో చేపట్టే ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని సేవా రుసుముల ద్వారా రాబట్టుకోనున్నారు.

ప్రభుత్వ రంగంలో ఏ నిర్మాణాలూ ఉండవు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా, ఎక్కడైనా ఆస్పత్రులు కావాలంటే పీపీపీ విధానంలోనే చేపడతారు. ఆ నిర్మాణాలకయ్యే వ్యయాన్ని రోగుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేస్తారు. రాష్ట్రంలో 500 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను, ఇతర రహదారులన్నింటినీ పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణ వ్యయాన్ని రుసుముల ద్వారా రాబట్టనున్నారు. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ ఆటోనగర్‌ వంటి పెద్ద పెద్ద బస్‌స్టాండ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. 

వివిధ స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని పార్కులు, పర్యాటక ప్రాజెక్టులు, వ్యసాయ రంగంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, కోల్డ్‌ స్టోరేజీలు, పారిశ్రామిక పార్కులు.. సెమీకండక్టర్లు, ఇ–మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్లతో సహా ఏరోస్పేస్‌ రంగాల్లో ప్రాజెక్టులను సైతం పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులను పీపీపీ విధానంలో త్వరగా చేపట్టి, పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

రాష్ట్రంలో అమలు చేస్తున్న పీపీపీ ప్రాజెక్టులకు వయబులిటీ గ్యాప్‌ నిధులను కేంద్ర ప్రభుత్వం అందించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరాలను తీర్చడానికి వివిధ ఆస్తులను తనఖా పెట్టేందుకు అవసరమైన నైపుణ్య మద్దతును నీతి ఆయోగ్‌ నుంచి తీసుకోనున్నారు. మొత్తంగా ఇకపై ప్రభుత్వ రంగంలో ఎలాంటి నిర్మాణాలు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పినట్లయింది.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)