Breaking News

దేశమంతా పైపైకి.. ఏపీలో నేలచూపులు

Published on Fri, 05/02/2025 - 05:12

సాక్షి, అమరావతి: నూతన ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ఆదాయం తిరోగమనంలోనే పయనిస్తోంది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో రాష్ట్ర జీఎస్టీ మొత్తం వసూళ్లు 3.4 శాతం క్షీణించి రూ.4,850 కోట్ల నుంచి రూ.4,686 కోట్లకు పడిపోయినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి. 

అదే సమయంలో కేంద్ర జీఎస్టీ వసూళ్లలో ఏకంగా 10.72 శాతం వృద్ధి నమోదైంది. మన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు 13 శాతం, తెలంగాణ 12 శాతం, కర్ణాటక 11 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి గత ఏడాది జూన్‌లో అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్ల క్షీణత ప్రవాహం ఆగడం లేదు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జీఎస్టీ ఆదాయం ఏటా రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.

అయితే, కూటమి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించడం లేదు. ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. అందువల్లే 2024–25 ఆర్థిక సంవత్సరంలో జూలై నుంచి మార్చి వరకు 9నెలల్లో ఏకంగా 6 నెలలు 2023–24 ఆర్థిక ఏడాది కన్నా జీఎస్టీ తక్కువగా వచి్చనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.     

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)