Breaking News

శ్రీకాంత్‌కు పెరోల్‌.. అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత

Published on Fri, 08/22/2025 - 05:55

సాక్షి, అమరావతి: తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అలివేలి శ్రీకాంత్‌కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్‌ మంజూరు చేయించడం వెనుక రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమేయం ఉందని తేటతెల్లమైంది. అంతటి తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన అతనికి పెరోల్‌ మంజూరు చేయడం సాధ్యం కాదని హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ కేవీ కిషోర్‌ కుమార్‌ స్పష్టంగా తిరస్కరించినా, హోం మంత్రి అనిత ఒత్తిడితోనే పెరోల్‌ మంజూరైందని స్పష్టమైంది. 

శ్రీకాంత్‌ పెరోల్‌ ప్రతిపాదనను జూలై 16నే హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ కేవీ కిషోర్‌ కుమార్‌ తిరస్కరించడం గమనార్హం. దీంతో మంత్రి బుకాయింపు బెడిసికొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత ఖైదీ అలివేలి శ్రీకాంత్‌కు పెరోల్‌ మంజూరు కోసం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్‌లు హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ కేవీ కిషోర్‌ కుమార్‌కు సిఫార్సు చేశారు. 

ఆ మేరకు వారిద్దరూ సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. కానీ.. తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుండటంతోపాటు గతంలో ఒకసారి జైలు నుంచి పరారైన శ్రీకాంత్‌కు పెరోల్‌ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు నివేదిక సమరి్పంచారు. దాంతో శ్రీకాంత్‌కు పెరోల్‌ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కిషోర్‌ కుమార్‌ తిరస్కరించారు. ఈ మేరకు అధికారికంగానే జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుపట్టి మరోమారు హోం మంత్రి అనితపై ఒత్తిడి తెచ్చారు. 



ఈ క్రమంలో శ్రీకాంత్‌ సన్నిహితురాలు అరుణతో మంత్రికిడీల్‌ కుదిర్చారు. డీల్‌ ఓకే కావడంతో శ్రీకాంత్‌కు పెరోల్‌ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోం మంత్రి అనిత స్వయంగా నోట్‌ఫైల్‌పై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఫైల్‌ హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ వద్దకు వెళ్లింది. హోం మంత్రి ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితిలో కుమార్‌ విశ్వజిత్‌ అనివార్యంగా శ్రీకాంత్‌కు పెరోల్‌ మంజూరు చేస్తూ జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాయి.  

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)