Breaking News

ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారు

Published on Tue, 01/21/2025 - 05:52

కంకిపాడు: ఫీజు కట్టలేదని విజయ­వాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాల నుంచి యాజమాన్యం ఓ విద్యార్థిని అర్థరాత్రి వేళ బయటకు పంపించేసింది. దీంతో ఆ విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. మీడియాకు సమాచారం వెళ్లటంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. బాధితుడి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్‌ కుమారుడు గౌతమ్‌ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు.

సంక్రాంతికి ఇంటికి వెళ్లిన గౌతమ్‌ ఆదివారం రాత్రి తన తండ్రితో కలసి కళాశాలకు వచ్చాడు. ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అను­మ­తిస్తామని కళాశాల సిబ్బంది చెప్పారు. టార్జాన్‌ తన వద్ద ఉన్న రూ 20 వేలు నగదును చెల్లించాడు. మిగిలిన రూ. 50 వేలు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని బతిమలాడారు. అందుకు యాజమాన్యం ససే­మిరా అని విద్యార్థిని కళాశాల నుంచి  పంపించేసింది. దీంతో విద్యార్థి గౌతమ్, అతని తండ్రి టార్జాన్‌ అర్ధరాత్రి కళాశాల గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు.

పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌లో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని వాపోయారు. నిర్దాక్షిణ్యంగా తమను బయ­టకు పంపించేశారని తెలిపారు. పోలీసులు కూడా కళాశాలకు చేరుకుని ఆరా తీశారు. దీంతో యాజమాన్యం విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడి విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)