Breaking News

జూలైలో తిరుమలలో  విశేష ఉత్సవాలు ఇవే...

Published on Mon, 06/26/2023 - 08:26

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జూ­లై నెలలో విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ పీఆర్‌ఓ విభాగం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. జూలై 1న శని త్రయోదశి, 3న ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూజ, గురుపూర్ణిమ, 13న సర్వఏకాదశి, 15న శని త్రయోదశి, 17న శ్రీవారి ఆణివార ఆస్థానం, 22న ఆండాళ్‌ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవా­రి తోటకు వేంచేయడం, 30న నారాయణ­గిరిలో ఛత్రస్థాపనోత్సవం ఉంటాయని తెలి­పింది.

కాగా, తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 83,889 మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీల్లో రూ.3.10 కోట్లు సమర్పించుకున్నారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని భక్తులకు దర్శనానికి 24 గంటలు పడుతోంది. 

తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సాంబశివరావు నాయుడు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనా­నంతరం ఆయనకు ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. సినీ గాయని సునీత, ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)