Breaking News

వేసవి సెలవుల్లో ప్రత్యేక రైళ్లు

Published on Fri, 04/26/2024 - 05:12

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ మండ్రూప్‌కర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (ట్రైన్‌ నంబర్‌ 07234) ఈ నెల 28నుంచి జూన్‌ 30వ తేదీ వరకు ప్రతి ఆదివారం సికింద్రాబాద్‌ నుంచి సంత్రగచి వరకు నడుస్తుందని పేర్కొన్నారు. 

 సికింద్రాబాద్‌లో రాత్రి 11.40 బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపూర్, కుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, బద్రాక్, ఖరగ్‌పూర్‌ మీదుగా మంగళవారం ఉదయం 5 గంటలకు సంత్రగచి చేరుతుందన్నారు. 

ఈ ట్రైన్‌ (నంబర్‌ 07235) తిరిగి ఈనెల 30వ తేదీ నుంచి జూలై 2 వరకు మంగళవారాల్లో సంత్రగచిలో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం  3 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. విజయవాడకు బుధవారం ఉదయం 8.45కు వస్తుంది. 18 బోగీలతో నడిచే  ఈ రైళ్లలో ఎటువంటి రిజర్వేషన్‌ సౌకర్యం ఉండదన్నారు. స్టేషన్‌లలో బుకింగ్‌ కౌంటర్ల వద్ద టికెట్లు పొందవచ్చునని తెలిపారు. యూటీఎస్‌  మొబైల్‌ యాప్‌ ద్వారా  ఆన్‌లైన్‌ టికెట్లు  తీసుకోవచ్చని తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)