Breaking News

ఇల్లు ఇచ్చి.. సోదరిగా బట్టలు పెట్టారు

Published on Sun, 12/21/2025 - 11:26

సామర్లకోట జగనన్న కాలనీకి చెందిన బండి విశాల భర్త సింహాచలం కోవిడ్‌ సమయంలో మరణించారు. ఎటువంటి ఉపాధీ లేక, దిక్కు లేని స్థితిలో ఉన్న ఆమె కుటుంబానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ప్రత్తిపాడు రోడ్డులో ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా స్వయంగా ఆమె ఇంటిని ప్రారంభించారు. గృహప్రవేశ సమయంలో సోదరిగా భావించి, తనకు బట్టలు పెట్టడం ఎప్పటికీ మరచిపోలేనని విశాల చెమర్చిన కళ్లతో చెప్పారు. అటువంటి ముఖ్యమంత్రినే ప్రజలు కోరుకుంటారని అన్నారు. మహిళా సంఘంలో సభ్యురాలు కావడంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి ఉచిత వడ్డీ సైతం ఆమెకు అమలు చేశారు. దీంతో నాలుగు వాయిదాల్లోనే విశాల రుణ బకాయి మొత్తం చెల్లించారు. 

మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో ఇంటి నిర్మాణానికి రుణం సైతం సులభంగానే లభించింది. ప్రస్తుతం ఆ రుణ బకాయి ఉండటంతో నోటీసులు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలోనే విశాల పెద్ద కుమార్తె మేఘన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సాయంతో బీఎస్సీ పూర్తి చేసి, డిప్లమో చేసింది. చిన్న కుమార్తె కీర్తిప్రియకు అమ్మ ఒడి పథకం అమలైంది. ప్రస్తుతం ఆమె బీకాం చదువుతోంది. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదు. తమ ఒక్క కుటుంబానికి ఇన్నివిధాల సాయం చేసిన జగన్‌ మేలును జీవితాంతం గుర్తుంచుకుంటామని, తమ ఆయుష్షు కూడా పోసుకుని, ఆయన నూరేళ్లు సంపూర్ణ జీవితం గడపాలని విశాల ఆకాంక్షించారు.  

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)