Breaking News

మరేటి సేత్తామ్ .. పనుల్లేవు.. దేశం ఎలిపోదాం

Published on Mon, 02/24/2025 - 21:48

పల్లకోయే లచ్చిమి.. ఏదో ఈ మూడోరాలు చేసిద్ధుమా.. వందో.. వెయ్యో పట్టుకొస్తే మెల్లగా రెండు నెలలు గడిచిపోతాయి... పల్లక ఇంట్లో కూకుంటే ఏటి వస్తాది చెప్పు... తిరిగి చేతి ఖర్చు కాకపోతే.. కష్టమో నష్టమో.. అటు వెళ్తే కాలం గడుస్తాది... పూట గడుస్తాది.. చెబుతోంది మంగ. అవునుగానీ పిల్లలిద్దరినీ అమ్మగారింట్లో ఒగ్గిసి రావడం మనసుకు కష్టంగానే ఉంది... కానీ చేతిలో పైసా లేదు.. పైగా ఖర్చులు చూస్తుంటే మరింత భయంగా ఉన్నది.. పిల్లల చదువులు. వారి బట్టలు.. పుస్తకాలూ.. ఇవన్నీ తల్చుకుంటే భయంగా ఉంది.. అందుకే నీతో వస్తన్నాను.. అప్పుడైతే జగన్ డబ్బులొచ్చేవి.. ఇప్పుడు అవి కూడా పైసా కానరావడంలేదు.. అవి వచ్చింటే చేతికి ఆధారమయ్యేది.. ఇప్పుడు అంతా మేమిద్దరమే పడాలి అంటూ చేతిలోని సమోసా ముక్క భర్త రామినాయుడికి ఇచ్చింది.. నాకొద్దే నువ్వు తిను అన్నాడు అయన..

మీ మొగుడూ పెళ్ళాల ముచ్చట్లు ఆపర్రా... అంది మంగ.. అవును మంగొదినా... పిల్లల్ని వదిలేసి ఈయన్ను ఈ మనిషిని వెంటేసుకుని జిల్లాలకు జిల్లాలు మారిపోయి అక్కడ పెసరచెను తీతకు వెళ్లడం మనసుకు కష్టంగానే ఉంది కానీ.. ఇక్కడ పైసా లేదు.. అందుకే.. అంటూ పిల్లల్ని తలచుకుని మథనపడింది... పోన్లేవే... లచ్చిమి.. రోజుకు ఒకరికి ఏడొందలు.. మీ మొగుడూ పిల్లలకు పదిహేను వందలు.. ఇద్దరూ రెండు వారాలు చేస్తే ఎంతోకొంత చేతికి వస్తాది.. పైగా బియ్యం వాళ్లే ఇస్తారు.. పడుకోడానికి రూములు కూడా వాళ్ళవే అని మంగ చెబుతుంటే లక్ష్మి కళ్ళు  భయం.. ఆందోళన స్థానే కాస్త ధైర్యం.. మెరుపు సంతరించుకున్నాయి.

రాయగడ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ మహిళలు.. కూలీలతో కిక్కిరిసిపోయింది.. అడుగుతీసి అడుగేయలేని పరిస్థితి. అందరూ నెత్తిన మూటలు.. కొందరు పారలు.. గునపాలు సైతం పట్టుకుని ఎక్కేసారు.. దాదాపుగా అందరూ కిందనే కూర్చున్నారు. ఏమ్మా అక్కడికి అని అడిగితె గుంటూరు.. వెళ్తున్నాం బాబు అన్నారు.. ఎందుకూ అంటే అక్కడ పెసర.. మినపచేలు తీయడానికి వెళ్తున్నాం అన్నారు. అక్కడ కూలీలు దొరకడం లేదట.. పార్వతీపురం ప్రాంతంనుంచి మహిళలు.. పురుషులను ఆ చేను తీయడానికి తీసుకెళ్తున్నారు. ఒకొక్కరికి ఏడువందలు రోజుకూలీతోబాటు జంటకు రోజుకు రెండుకేజిల బియ్యం కూడా ఇస్తారు.

చిన్న రూము.. షెడ్లు కూడా ఉంటాయి.. అక్కడే వండుకుని తిని ఇద్దరూ తెచ్చుకున్న డబ్బును జాగత్త చేసుకుని మూడు వారాల తరువాత మళ్ళీ సొంత ఊళ్లకు వెళ్తారు.. సీతానగరం.. పార్వతీపురం.. కురుపాం ... బాడంగి.. రామభద్రపురం మండలాల నుంచి కూలీలు ఇదే ట్రైన్లో వెళ్తారు.. వంటకు ఎలా మరి అని అడిగితే ఒసే.. పళ్లకుందో ... అప్పులు..పప్పులు.. వర్రగుండ .. పచ్చళ్ళు.. చింతపండు.. అన్నీ పట్టుకెళ్ళిపోతాం కదేటి .. అక్కడే కఱ్ఱలపొయ్యిమీద నాలుగు గింజలు ఉడకేసుకుని తినేసి పడుకుండిపోతాం అంటారు అందరూ కోరస్ గా.. పిల్లల్ని ముసలోళ్ల చెంత వదిలేసి వెళ్లడం బాధగానే ఉంది కానీ.. ఇద్దరం ఈ నాలుగురోజులు కష్టపడితే ఓ ఇరవైవేలు వస్తాయి.. జూన్లో పిల్లల చదువులు.. ఇతర ఖర్చులకు సరిపోతాయి.. అందుకే ఎంతదూరం అయినా వెళ్తామని... మనసు దిటవు చేసుకుని షార్ట్ టైం లేబర్ పేరిట కృష్ణ గుంటూరు జిల్లాలకు వెళ్తుంటారు..

-సిమ్మాదిరప్పన్న

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)